Sunday, January 27, 2013

ఊసరవెల్లికి మిన్న ఉండవల్లి

http://www.namasthetelangaana.com/Editpage/columnists/Allam-Narayana.asp?ContentId=199468

undavalliఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఊసర అన్నారు. ఊసర నయం విషం చిమ్మే ఊసర కూడా అన్నారు. మాట నిలకడలేనందువల్ల మరేమైనా అనొచ్చు. మమ్మల్ని రజాకార్లు, ఖాసిం రజ్వీ అంటావా! నువ్వు ‘పెద్దాపురం వేశ్య’వి అన్నాడు పొన్నం ప్రభాకర్.

(ఈ మాటతో నాకు తీవ్ర అభ్యంతరం వుంది. వేశ్యలను కించపరచడం మరో రకమైన అల్పత్వం కనుకనే) అయినా ఇవేవీ ఉండవల్లిని వర్ణించడానికి సరిపోవు. రంగస్థల నటుడు అనేది చిన్నమాట. సోనియాగాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసు అని మాట్లాడిన దుబాసీ మాటల నుంచి, రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదన్న వాదన నుంచి, చివరికి కేంద్రంలో షిండే గడువు, తెలంగాణపై ప్రకటన వస్తుందన్నప్పుడు, రాజమంవూడిలో ముందు ‘జై ఆంధ్ర’ సదస్సుపెట్టి, ఆనక రెండొద్దుల్లోనే గడువు వాయిదా వేసి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు పదహారోసారి దోఖా ఇచ్చిన తర్వాత ‘జై ఆంధ్రవూపదేశ్’ సభగా మార్చుకునేదాకా ఆయన ఊసర కన్నా ఎక్కువగా వేగవంతంగా రంగులు మార్చింది నిజమే. దానికాయన అర్హుడే. సరే! ఉన్న సమైక్యాంధ్ర కోసం జై ఆంధ్రవూపదేశ్ సభపెట్టి ఒక్క తెలంగాణ ప్రతినిధీ లేని సభలో, చివరకు తెలంగాణతో సహా ఆంధ్రవూపదేశ్ అంతటికీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను కూడా పూర్తిగా ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసి, తెలంగాణ మీద, ఉద్యమంమీద, నాయకత్వంమీద, ప్రత్యేకంగా కేసీఆర్ మీద విషం కక్కినందువల్ల ఆయన విష ఊసర అనడమూ నిజమే. (బొత్స కూడా లక్షణాలు మార్చి ఉన్నందున ఆయన చరిత వేరేగా చెప్పుకోవాలి. ఆయన రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమి? అనిమాటమార్చి సమైక్యాంవూధకు డప్పుకొట్టిన వైనం వెనుక కూడా తెలంగాణ అనివార్య సంకేతాలు ఉన్నాయి. అదే వేరే విష యం.) కానీ, ఇది ఉత్త విమర్శే అవుతుంది. తలుపుచెక్క, తమలపాకు శాస్త్రం అవుతుంది. ఉండవల్లి మాటలన్నింటిలోనూ, ఆయన సభ రెండు రోజుల ముందర, ఆ తర్వాత జరిగిన నాటికి మారిన ఎజెండాలోనూ, ఢిల్లీ లాబీయింగ్ నేపథ్యం ఉన్నది. అక్కడ వేగవంతంగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యమూ ఉంది. వేగవంతంగా తలకాయలు మార్చినంత సులభంగా మాటమార్చిన సోనియాగాంధీ ముఠా మడత నాలుకల సారాంశంలో ‘దాల్‌మే కుచ్ కాలా హై’ అన్న సందేహాస్పద ప్రవర్తనా ఉన్నది. ఇది రెండు సందర్భాల్లోనే జరిగింది. అందుకే ఈ సందర్భంలో ఉండవల్లి ఊసర మించినవాడు. అతను కక్కిన విషం శాశ్వతంగా తెలంగాణను అడ్డుకునే ప్రణాళికతో కూడుకున్నది. ఆడిన ప్రతి అబద్ధానికీ ఒక లక్ష్యమూ ఉన్నది. చివరగా జై ఆంధ్రవూపదేశ్ సభ తేల్చిన తెలంగాణ రాదు అన్న సారాంశం ఉన్నది. అది అత్యంత ప్రమాదకరమైనది.

ఉండవల్లి మాటలకేమి? ఆయన మాట్లాడిన తీరు తెలంగాణలో ప్రతివాళ్ల నెత్తురు మరిగించిందీ నిజమే. ఉండవల్లి ఆడిన అబద్ధాలు తెలంగాణ ప్రతి గుండెకూ ములుకుల్లా తాకిందీ నిజమే. తెలంగాణ ఉద్యమాన్ని చేసిన అవహేళనా ‘ఏందిది ఇంత అహంకారమా?’ అని తల్లడిల్లజేసిందీ నిజమే. కానీ ఉత్త మాటలకేం గానీ ఉండవల్లి ఆడిన అసత్యాలన్నింటిలో, ఒక అబద్ధపు తీర్పు అది పరమ క్రూరమైంది. పరమ పరిహాసమైంది. అవును రాష్ట్రం విభజన జరగదు. మేము నూటా డ్బ్భై ఐదు మందిమి ఉన్నాం. మీరు నూటా పందొమ్మిది మంది ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చెయ్యకుండా విభజన జరగదు. ఈ రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌గానే ఉంటుంది శాశ్వతంగా అన్నాడాయన.

అదీ ప్రమాదకరమైనది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత, భవిష్యత్ దార్శనికుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ద్విభాషా రాష్ట్రాల్లో భాషా మెజారిటీ ఉన్మాదం గురించి ఊహించినవాడూ అయిన అంబేద్కర్ ఒక పరిష్కారంగా చూపిన ఆర్టికల్ 3 నీ ఉండవల్లి అవమానించారు. సారాంశంలో తెలంగాణ ఉద్యమం ఏ స్ఫూర్తితో అయితే, ఏ ఆర్టికల్ 3 రాజ్యాంగ స్ఫూర్తితో అయితే పోరాడుతున్నదో ఆ స్ఫూర్తిని దెబ్బతీసి మొత్తంగా ఉద్యమాన్నే దెబ్బతీయడానికి కుట్రపన్నాడు ఉండవల్లి. అదీ ప్రమాదకరం. ఆయన జై ఆంధ్రవూపదేశ్ సభ లక్ష్యం అదీ. ఒక్క కిరణ్‌కుమార్‌డ్డి తప్ప ఆంధ్ర ప్రతినిధులందరూ, గద్దలు, పెద్దలందరూ హాజరయిన ఈ సభ తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, అహింసాయుత మార్గాన్నీ, రాజ్యాంగ స్ఫూర్తినీ దెబ్బకొట్టడానికి ఉద్దేశించింది. ఆయనొక మాటంటే, మనమో మాట అనడం సులభం. కానీ ఉద్యమ మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేసినవాడు ఉండవల్లి. మనం ఊరికే వాడే ఊసర పదాలు ఆయన. ఈ చర్యకు సరిపోవు.
ఉండవల్లి ఒక DEMAGOGY (డెమగాగీ) డంబాచారి. వాగాడంబరుడు. ఉద్దేశ్యిత, ప్రేరిత లక్ష్యాలతో అబద్ధాలను ప్రయోగించినవాడు. బ్రౌన్ నిఘంటువు ప్రకారమే అయితే, డెమగాగీ అంటే ‘కలహండ్ల మొనగాడు.. కలహము పెట్టి. పదిమందిని ఎత్తివిడిచేవాడు’..

తెలంగాణ మలి ఉద్యమం ముందంజలో పరిణితి చెందింది. అధ్యయనం, ఆచరణ జమిలిగా సాగిన ఉద్యమం. తెలంగాణ బౌద్ధిక ప్రపంచం మున్నెన్నడూలేని తీవ్ర అభినివేషం ప్రకటించి మూలాలను అన్వేషించింది. వలస ఆధిపత్యం స్వాతంవూత్యానంతరం జరిగిన పరిణామాల్లో భాషా పెత్తనం, సంస్కృతీ ఆధిపత్యం నెలకొల్పుకోవడానికి, స్థిరపరుచుకోవడానికి, వలసలో జనబాహుళ్యాన్ని బానిసలుగా చేసుకొని శాశ్వత అధికారాన్ని నెలకొల్పుకోవడానికి, రెండు పద్ధతులు పాటిస్తూ వస్తున్నాయి. ఒకటి క్రూర పద్ధతి. పాలన, అధికారాలతో హింసతోనో, అణచివేత. మరొకటి గుంభనంగా, పట్టువస్త్రంలో దాచి పొడిచే పచ్చల పిడిబాకు గాయంలా ఉండేది. అది వలస ప్రాంతపు భూమి పుత్రులను, ప్రజలను గాయపరుస్తుంది. వాళ్ల దేవుళ్లను వెక్కిరిస్తుంది. వాళ్ల చరివూతను వెక్కిరిస్తుంది. వాళ్ల భూభాగాన్ని వెక్కిరిస్తుంది. భాషను వెక్కిరిస్తుంది. సంస్కృతిని వెక్కిరిస్తుంది. ఇవన్నీ అభివృద్ధి చెందిన సమాజాల ముందు ఆటవికాలుగా తీర్పులిస్తుంది. ఇది ప్రమాదకరమైనది. తెలంగాణలో వలసాధిపత్యం ఈ రెండూ అమలు పరుస్తున్నది. తాజా కలం. జేఏసీ తలపెట్టిన దీక్షకు పోలీసు అనుమతి ఉండదు.

జై ఆంధ్రవూపదేశ్‌కు ఎర్ర తివాచీ ఉంటుంది. ఎక్కడి వాళ్లనో తెచ్చి హైదరాబాద్‌లో కాపలాతో సభ నిర్వహిస్తే కాపలా కాస్తుంది. ప్రతిపక్షమే అయినా, పరస్పరం శత్రువులే అయినా చంద్రబాబు, విజయమ్మ యాత్రలకు పోలీసు బలగాలనూ, సర్వ యంత్రాంగాన్నీ వినియోగిస్తుంది. ఆ యాత్రలను నిరసించిన విద్యార్థుల వీపు పగలగొట్టి రౌడీ షీట్లు తెరుస్తుంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ అందుకే ఇక్కడి నుంచి వెళ్ళినారని ఆయన చెప్పిన బ్రాహ్మణులనూ వదలకుండా, తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఓ ఎత్తున ఉన్నదని ఆవేశంగా, ఎకసక్కెం చేస్తాడు, మీరు ఆనకట్టను కట్టుకోంగ వద్దన్నమా? అని హేళన చేస్తాడు. కానీ ఇవన్నీ సమైక్యవాదం సన్నగిల్లిన తరుణాన రెచ్చగొట్టడానికి, అక్కడ లేని సమైక్యవాదాన్ని రగిలించడానికి విషం కక్కుతాడు. అబద్ధాలు ఆడతాడు. అభినయం చేస్తాడు. అచ్చు జింగోయిస్టు లాగా, ఒక కుహనా దేశభక్తిని గానీ, ప్రాంతీయ భక్తిని గానీ రెచ్చగొ మాట్లాడుతాడు. అందుకే ఉండవల్లి ఊసర మాత్రమే కాదు. ఆయన జై ఆంధ్రవూపదేశ్ సభ ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తితో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాడు. దాని పరిణామాలు కావాలి. ఆయనకు దాని పర్యవసానాలు కావాలి. ఆయనకు మరోవైపు వలసాధిపత్యపు మెత్తని కత్తి అవతారం ఎత్తి తెలంగాణ భూమి పుత్రులను న్యూనపరచడమే ఆయన లక్ష్యం. అది ప్రమాదకరమైనది. బ్రూట్ మెజారిటీ ఉన్నది. ఆర్టికల్ 3 చెప్పాల్సిన చోట అద్వానీని అడ్డంపెట్టుకుంటాడు. ఆర్టికల్ 3 ఉన్నదనే విషయం తెలియక కాదు. నిజానికి ఉండవల్లికి ఆయన చెప్పిన అబద్ధాలన్నింటి గురించి తెలుసు. కానీ ఇవ్వాల్టి అవసరం వేరుగా ఉంది.

తెలంగాణ ఉద్యమం రెండు సందర్భాల్లోనే ఇది జరిగింది. డిసెంబర్ 9 ప్రకటన వచ్చినాక ఇది జరిగింది. ఇప్పుడు కూడా అంతే ఎవరూ అడగకున్నా, ఎంపీల ఒత్తిడి లేదా ఎఫ్‌డీఐల కోసం ఎంపీల అవసరం ఏర్పడిన షిండే అఖిల పక్షం ప్రకటించాడు. ఆఅఖిలపక్షం అయినాక ఆయనే స్వయంగా గడువు విధించడం, ఆ గడువులోపు తెలంగాణ వస్తుందేమొ అన్న స్థాయిలో కేంద్ర మంత్రులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు గులామ్‌లు, పటేల్‌లు, రవిలు కూడా తేడాగా మాట్లాడడం, అన్నింటి కన్నా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్య పరిస్థితి ఏర్పడడం లాంటి సంకేతాలతో సీమాంధ్ర నాయకత్వం బెంబేపూత్తింది.

డిసెంబర్ 9 సందర్భంలో అప్పటి దాకా తెలంగాణ ఉద్యమం తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలకూ, కాంగ్రెస్ నాయకత్వానికి, రోశయ్యకు కూడా న్యాయబద్ధమైనదిగా కనబడింది అప్పుడు కూడా అన్ని పార్టీలు తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టారు. ఇదేదో తేలాల్చిన సమస్యగానే కనపడింది. చివరికి చంద్రబాబు మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టండి అనే దాకా వెళ్లింది. సీమాంధ్ర మీడియాకు కూడా తెలంగాణ డిసెంబర్ 9 కి ముందు ముద్దుగానే కనపడింది. అన్యాయమైపోయిన ప్రాంతంగానే కనబడింది. తెలంగాణ ఉద్యమం నడుపుతున్న నాయకులందరూ రాక్షసుల్లా కాక మామూలు చీమూ నెత్తురు కొంచెం ఎక్కువగానే ఉన్న నాయకులుగానే కనబడ్డారు. కానీ చిదంబరం డిసెంబర్ 9 ప్రకటనతో సర్వం మారిపోయింది. ఆంధ్రోళ్ల ప్రపంచం తలక్షికిందులయ్యింది.

తెలంగాణ ఇవ్వరన్న అంచనాలతో డాంబికాలు పలికిన వాళ్లు, ఒకరిని మించి మరొకరు తెలంగాణ ఓటు బ్యాంకు కోసం ఎనలేని ప్రేమలు కురిపించిన వాళ్లు. తెల్లారేసరికి అందరూ కుమ్మక్కు అయ్యారు. వలసాధిపత్యం జడలు విప్పింది. తేడాలేదు. ఒకటే విద్వేషపు ముఖం. తెలంగాణ రక్త మాంసాలు పీల్చిన ముఖాలు. సీమాంధ్ర పెట్టుబడిదారుల తత్వమే. ఆప్రాంతపు రాజకీయ విశ్వాసాల పునాది అయింది. విలువ అయింది. వాళ్ల కోసం అక్కడ ఉద్యమం, పెంపునకు విద్వేషం కొన్ని అబద్ధాలు అనివార్యంగా తయారయ్యాయి. ఆ ఉద్యమం వంద అబద్ధాల మీద ప్రారంభం అయింది.
లోక్‌సభకు ఎన్నికైన అత్యంత సంపన్నుడు లగడపాటి రాజగోపాల్ (జగన్ ఆస్తులు ప్రకటించక ముందు), నంబర్ వన్ కాంట్రాక్టర్ కావూరి సాంబశివరావు, రాజకీయనేతగా మారిన వ్యాపారవేత్త టీజీ వెంక ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన జేసీ దివాకర్‌డ్డి, తులసిడ్డి, ఆంధ్ర ఉద్యమ సంఘ మేధావిగా చెప్పుకునే చలసాని శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటివాళ్లు పత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో ఆంధ్రవూపదేశ్ చరిత్ర గురించి, తెలంగాణ గురించి, రాజ్యాంగం గురించి, హైదరాబాద్‌ను అభివృద్ధి చెయ్యడం గురించి, తెలంగాణ వాళ్లకు వంట రాదనటం దగ్గర్నుంచి అన్ని వాదనలూ వందలాది అబద్ధాలతో వివరించారు. పెట్టుబడిదారులు, అధికా రం, అబద్ధాలు, దుర్బేధ్యమైన అజ్ఞానం, వక్రీకరణలు, సందర్భరహిత వ్యాఖ్యానా లు, విషయాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకొని సమాచార భంగం చెయ్యడం లాంటివి ఆంధ్రవూపదేశ్‌ను హోరెత్తించాయి. ఈ అబద్ధాలను పదే పదే ప్రచారం చెయ్యడానికి సీమాంధ్ర మీడియా సంస్థలు తీవ్ర ఉత్సాహాన్ని ప్రదర్శించాయి.

జయశంకర్ సార్ సూత్రీకరించిన పాలకులు, వారిని ప్రభావితం చేసే సంపన్న వర్గాలు, తానాతందానా అనే మీడియా దుమ్మురేపింది. ఇదంతా తెలంగాణ ప్రకటన వెనక్కు తీసుకున్నాక, శ్రీకృష్ణ కమిటీ వేసేదాకా జరిగింది. ఆ తర్వాత గప్‌చుప్. సమైక్యాంధ్ర అన్నవాడు లేడు. ఉన్నవాడు లేడు. పనిబడా జేఏసీలు పెట్టినవాళ్లు మరుగైపోయారు. రికామీగా ఉన్న పరకాల ప్రభాకర్ లాంటి వారు నూటొ క్క అబద్ధాలతో ఉల్టా బనాయింపులతో తెలంగాణ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఆయనకు కాలం కలిసిరాక సరిగ్గా సీమాంధ్ర పెట్టుబడిదారుల, కేవీపీ లాంటి దురహంకారులతో కూడి ఢిల్లీలో మమ అనిపించుకుని ఒక పుస్తకం విడుదల చేయగలిగాడు. ఆయనతో పెద్ద ప్రమాదం లేదు. ఆ రాతలు ప్రమాదకరమైనవే.
ఆత్మలేని ఆ అధికార మహాసౌధాల స్తంభాల చుట్టూ జీవితాంతం ఆత్మను కోల్పోయి తిరుగాడిన సంజయ్‌బారు చివరికి ప్రభాకర్‌కు ఊతమయ్యారు. ఆయన మనసు, ఆత్మ వేరు వేరు చేసి కోల్పోయిన లేని స్పృహతో చెప్పిన మాటలను మీడియా బంగారంగా భావించి అచ్చోసింది కానీ ప్రభాకర్ పుస్తకానికి, సంజయ్‌బారు శల్య సారథ్యపు భావ దారివూద్యానికీ ఎర్రని ఏగాణి విలువలేదు. అధికార పీఠాలను పట్టుకొని వేలాడిన వాళ్లను తెలంగాణ బౌద్ధిక ప్రపంచం మూలాల్లోనే తిరస్కరిస్తుంది. అది చాలు. అదిగో అట్లా చల్లారిన సమైక్యాంధ్ర కోసం మళ్లీ ఒకసారి తెలంగాణ కనబడగానే మళ్లీ లేపి నిలబెట్టడానికి, చచ్చిన శవాన్ని బతికించడానికి, పుచ్చిన కట్టెతో ధ్వజస్తంభం నిలబెట్టడానికి చేస్తున్న ప్రమాదకర తుది ప్రయత్నమే ఉండవల్లి చేసిన ప్రయత్నం.

తెలంగాణ రాకుండా ఉంటే.. తెలంగాణ కనుచూపు మేరలో లేకపోతే, తెలంగా ణ భూతం రాష్ట్రాన్ని ఆవహించకపోతే వీళ్లందరూ హైదరాబాద్‌నూ, తెలంగాణను దోచుకోవడంలో బిజీగా గడిపేవాళ్లు. ఈ అంతర్జాతీయ పెట్టుబడిదోపిడీ దొంగలు ఇవ్వాళ్ల కక్కుతున్న విషానికి, ముసుగు వీరుడే ఉండవల్లి.
ఆయన మెజారిటీ గురించి మాట్లాడి, మాటమార్చి మాతో చర్చలకు రావాలంటాడు. మీరట్లా మాట్లాడితే మెజారిటీగా ఉన్నవాళ్లం రాష్ట్రం ఎట్లా వస్తుందంటాడు. అంతటితో పోకుండా, స్వభావంలోనే మొట్టమొదటిసారి ‘మేము వేరు మీరు అల్పులు మీరు వేరు. చాతగాని వాళ్లు. మీ భూములు పనికిరావు, మీ జాగలు పనికిరాదు’ అని న్యూనపరుస్తూ రెచ్చగొడ్తాడు. ఇదీ ప్రమాదం. అందుకే ఉండవల్లి లక్ష్యం పెద్దది. ఊసర స్థాయికి మించింది. ఉద్వేగాలను, విద్వేషాలనూ రెచ్చగొట్టి, సీమాంధ్ర ప్రజల్లో లేని, భావోద్వేగాలను రెచ్చగొట్టి, శాశ్వతంగా తెలంగాణ రాకుండా చెయ్యడమనే కుట్రలో భాగంగానే ఇది జరుగుతున్నది. అందుకే ఆయన డెమగాగీ... తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలకు బాధ్యుడైన వాడే ఆ శవాల మీద అబద్ధాలు నిర్మిస్తాడు. అదీ విషాదం.

రెండంశాలు మాట్లాడాడు ఉండవల్లి. అతి కీలకమయింది విలీనం బలవంతంగా జరిగింది అన్న అంశాన్ని విభేదిస్తూ అబద్ధాలాడడం. విలీనం కోసం ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ అంగలార్చలేదని, ఇది బలవంతపు విలీనం కాదని, తెలంగాణవాళ్లు కోరుకుం విలీనం అయ్యిందని అతిపెద్ద అబద్ధం అడారాయన. అందుకు సరోజినీనాయుడు కుమారుడు, ఎంపీ జయసూర్యను అరువు తెచ్చుకుని ఆయన ప్రసంగాలను ఉటంకించారు. మధ్యలో ఒక పత్రం చదువుతూ మిగతా విషయాలు మనకెందుకు? అని ఆయనకు ఆయనే సర్దిచెప్పుకున్నాడు కూడా. అంతే విలీనం బలవంతంగా జరగలేదనడానికి వీలైన పత్రాలు మాత్రమే చదివి, ఇదంతా బూటకం అని ఏకపక్షంగా తీర్మానించాడు ఉండవల్లి. అది నిజం కాదని ఒక లక్షసార్లు నిరూపణ చేశారు తెలంగాణవాదులు.

1955 నవంబర్ 25న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఆమోదించిన ఏకక్షిగీవ తీర్మానం మొదలుకొని, అప్పటి ఉపముఖ్యమంత్రి ఫిబ్రవరి 1న చేసిన విజ్ఞాపనల దాకా, తెలంగాణ ప్రజలకు తగిన రక్షణలుంటాయి, వారి హక్కులు చట్టపరంగా గ్యారంటీలుంటాయి. లాంటి మాటలు, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ల మాటలు, విశాలాంధ్ర ఇప్పుడు కాకపోతే ఎపుపడూ ఏర్పడదన్న వాస్తవం, ఆంధ్ర ఆర్థికాదాయాలు, తెలంగాణ ఆదాయం (ఆబ్కారీ, భూమిశిస్తు) ఎక్కువన్న అభివూపాయాలు, కరువు కాలాల్లో కూడా తెలంగాణలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువ ఉన్న పరిస్థితులు లాంటి వాటి చర్యలను, ఆ విషయాలను సౌలభ్యం కోసం విస్మరించి ఉండవల్లి తనకు కావల్సిన సమాచారాన్ని వాడుకున్నారు. (విషాదమేమంటే అదే సభలో ఒక చిన్న చిట్టీ వచ్చింది. ప్రేక్షకులు పంపిన జాబు. ఆ తర్వాత ఉండవల్లి సరోజినీ నాయుడు అంటే ఎవరు అని వివరించారు) అదీ అక్కడ చేరిన వారి స్థాయి. ఈ రక్షణలు ఎందుకవసరమైనవో తెలిస్తే ఉండవల్లి ఎంత పెద్ద అబద్ధం ఆడాడో అవగతం అవుతుంది. గోవింద్ వల్లభ్‌పంత్ సమక్షంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో కాలపరిమితిలేని చట్టరక్షణలు దానిద్వారా ఒప్పందం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ రక్షణలు, ఒప్పందాల ఉల్లంఘనలు మరుసటిరోజు నుంచే జరిగాయి. దానిపైన పార్లమెంటు సభల్లో రజ్‌బహదూర్‌గౌర్, గులాం పంజాతన్, వి.కె.ధగ్, హరిశ్చంద్ర హెడా లాంటి ఎంపీలు అనేకసార్లు చర్చ పెట్టారు. దామోదరం సంజీవయ్య రక్షణల ఉల్లంఘనను స్వయంగా అంగీకరించారు. ఇదంతా విస్మరించిన చరిత్ర కాదు. ఇటీవలిదే. కానీ ఉండవల్లి అబద్ధాలు ఈ అంశంలోనే ఇతర సమాచారం మీద నిజాలంత స్థాయిలో నిర్మితమయ్యాయి. బూర్గుల రామకృష్ణారావు విలీనం కోరడం గురించి చెప్పి, ఆ తర్వాతి పరిణామాలు ఎత్తుకోకపోవడం. నిజానికి తెలంగాణ వేరు రాష్ట్రంగానే ఉండాలన్న బూర్గుల అనంతర కాలంలో ఏఏ ప్రలోభాలకు లొంగారో, ఏ ఏ భయాలకు లొంగారో? అవన్నీ వివరమైన చర్చ జరిగే ఉన్నది. ఆయన తర్వాత కేరళ గవర్నర్ కూడా కావడం అప్పటి సంగతులకు నిదర్శన సత్యం కూడా. అదీ ఉపయోగించుకుని విలీనం కోరుకుంటే అయిందని ఉండవల్లి విషం కక్కారు.

నీటి ప్రాజెక్టుల సంగతి ఉండవల్లి చెప్పిన కొత్త సత్యాలేవీ లేవు. గ్రావిటీ నీరు, పల్లమెరిగే నీరు, తెలంగాణ లక్షలసార్లు చర్చించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, డిండి, కోయిల్‌సాగర్, వైరా, పాలేర్, మున్నేర్, మూసీ లాంటి ప్రాజెక్టుల కింద ఆంధ్ర రైతులు ముసిరినప్పటికీ, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యమయ్యాయో? అందరికీ తెలుసు. వరదకాలువ దుస్థితి, ఇతర ప్రాజెక్టుల దుస్థితి, చెరువుల విధ్వం సం, చివరికి మృగతృష్ణ లాంటి దేవాదుల ప్రాజెక్టును చూపి తెలంగాణ అక్కరకు రాని భూమి అని తేల్చిన ఉండవల్లి చర్చకు నిలవలేడు.

నందికొండ ప్రాజెక్టు నాగార్జునసాగర్ కావడం, ఎడమ కాలువ కుదించుకుపోవడం, శ్రీశైలం ఎడమ కాలువ ఒక ఫార్సు కావడం, ఇప్పటి ఆల్మట్టి, అప్పటి సొరంగమార్గాన్ని ఆంధ్ర తిమింగలాలు ఎత్తుకుపోవడం ఇట్లా కోకొల్లలు. నీటి వినియోగం లెక్కలు, నదీ పరీవాహక ప్రాంతం, కేటాయించిన నీళ్లు, వాస్తవంగా తీసుకుంటున్న నీళ్ల లెక్కలు టీఎంసీలతో సహా ఉంటాయి. ఏ చిన్న పిల్లవాడైనా ఈ విషయాల మీద ఉండవల్లికి పాఠం చెప్పగలడు. ఇవీన్న అంగీకరించిన సత్యాలు. నీటి పారుదల విలీనం తర్వాత పెరగడానికి, ఆయనే ఉటంకించిన కరెంట్ వినియోగానికి ఒకే జవాబు, చెరువులు ధ్వంసం అయిన, ప్రాజెక్టులు రాక, శ్రీరాంసాగర్ నుంచి ధవళేశ్వరం దాకా ఒక్క ఆనకట్టా లేక (ఇచ్చంపల్లిని కుట్ర పూరితంగా కాకుండా చేశారు) భూగర్భ జలాలను పాతా ళం నుంచి తోడి వ్యవసాయం చేసి భగీరథ ప్రయత్నంతో సాగును పెంచుకున్నది తెలంగాణ. కాళ్లతో కాల్వలు మళ్లించుకునే మీ గోదావరి, కృష్ణా డెల్టాలకన్నా, బోరు పొక్కలు తవ్వి, కరెంటు మోటార్లతో కనాకష్టంగా పంటతీసి వరి ధాన్యాగారం అయింది కరీంనగర్. అదీ వ్యవసాయమంటే సహజంగానే ఈ కడగొట్టు కఠిన వ్యవసాయంతో ఆత్మహత్యలూ పెరిగాయి. అందుకే కరెంటు సగటు వినియోగమూ పెరిగింది. ఈ వాస్తవం ఆయనకు తెలియకకాదు మనల్ని, మన భూమిని హేళన చేసి మరిగింపజేయాలి అదీ లక్ష్యం.
ఇక తెలంగాణ ఉద్యమం మీద, ఉద్యమ నాయకత్వం మీద ప్రధానంగా కేసీఆర్ మీద, కొంచెం కోదండరాం మీద ఉండవల్లి దాడి ఎక్కుపెట్టాడు. బ్రిటిషాంవూధలో బలిసిన ఈ పెద్దమనుషులు లౌక్యం, బతకనేర్చినతనం, వ్యవహార జ్ఞానం, బతకడానికి ఎంత మోసపు పద్ధతులైనా అవలంబించే కపటత్వం మెండుగా చేసుకునే ఆధునిక గిరీశాలు.

కడుపు నిండిన వాడు గుంభనంగా మాట్లాడతాడు. మోసంతో మాట్లాడతాడు. పెదాల మీంచి మాట్లాడతాడు. తేనె పూసిన కత్తిలా ఉంటాడు. కడుపులో కత్తులు దాచుకొని కావలిచ్చుకుంటాడు. అదీ తరహా. కానీ వాస్తవాలు తెలిసి ఉద్యమం మీద స్పష్టమైన అవగాహన ఉండీ, మోసాల మీద, కడుపుమాడి రాజకీయ యవనిక మీద జరిగే కుట్రలూ, కుతంవూతాలు తెలిసీ, మనుషులు రాలిపోతుం కూడా మర్యాదగా మాట్లాడం ఇక్కడి ఉద్యమకారులకు ఎట్లా చాతనవుతుంది. ‘ఉల్టాచోర్ తారుమారు మాటలకు ఎవరైనా ఒకే భాష మాట్లాడతారు. అది అప్పటికే. తెలంగాణనకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం’ అంటారు. అది అప్పటికే. అట్లా నరికితే ఎవరన్నా మిగులుతరా! అడ్డమొస్తే గుంజికొట్టుడే అంటే ఎంతమందిని కొటిండ్రు. ఆ భాష ఉద్వేగాలున్న ప్రతిచోటా వచ్చేదే. అట్లని ఆ భాషను తెలంగాణ లో ఉన్న బుద్ధిజీవులు తగదని చెప్తూనే ఉంటారు. కేసీఆర్‌ను ఏ హరగోపాలో, ఏ వరవరరావో, ఏ గద్దరో, ఏ కోదండరామో విమర్శిస్తూనే ఉంటారు. అది దిద్దుబాటు విమర్శ. ఇట్లా వద్దనే విమర్శ. తెలంగాణ ఉద్యమం తీరుతెన్నుల మీద, పంథాల మీద మందకృష్ణ, గజ్జల కాంతం, ఐలయ్య లాంటి వాళ్ల తీవ్ర విమర్శలు కేసీఆర్ ఎదుర్కున్నారు.

ఈ ఉద్యమం పన్నెండేళ్ల కాలంలో కేసీఆర్ ఎదుర్కున్నన్ని విమర్శలు ఏ రాజకీయ నాయకుడూ ఎదుర్కోలేదు. నిజమే. విమర్శలు చేస్తున్న వాళ్లు కూడా ఉద్యమం బాగుండాలనే ఆకాంక్షతో చేస్తారు. ఉండవల్లి విషం కక్కా డు. కేసీఆర్‌ను ఒక రాక్షసుణ్ని చేసి, ఆయన ద్వారానే తెలంగాణ సాధ్యం కావడం లేదు. ఆయన వల్లనే మేము అంగీకరించడం లేదు. అని ఉద్యమానికి నాయకత్వం లేకుండా చెయ్యడం ఆయన అసలు కుట్ర. కానీ కేసీఆర్‌కు స్పష్టత ఉన్నది. ఆయన కొన్ని సాధించారు. తెలుగుతల్లి ఎవరి తల్లి అంటే పండితులు,పామరులు గయ్యిన లేచారు. ఇవ్వాళ్ల తెలంగాణలో తెలంగాణ తల్లే నిజం. మీ బిర్యానీ పెండపూక్కుంటదంటే మమ్మల్ని, మా ఖదర్‌ను న్యూనపరుస్తున్నారు. మీకే ఖదర్ తక్కువ అని మీ మనసుల్లో తుఫాను సృష్టించి అల్లకల్లోలం చేశారు. మీ పెత్తనానికి అది విరుగుడు. వరవరరావు ఒక సభలో అన్నారు. అవును కేసీఆర్‌ను తెలంగాణ ఆంధ్రావాళ్లు విమర్శించడానికి, వాళ్లు విమర్శించడానికీ తేడావుంది. వాళ్లది దుర్బుద్ధి. కేసీఆర్‌నూ, తద్వారా ఉద్యమాన్నీ నాశనం చేసేందుకే ఆ విమర్శలు. అవి ప్రమాదకరమైనవి.

అన్ని అంశాలతో పాటు ఉండవల్లి తనకు తెలియకుండానే ఒక మేలు చేశారు. అది విభజన. ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ వాళ్లు వేరని, మేము వేరని, ఆంధ్రవూపదేశ్ అంటే మేమేనని, మీరు కాదని గొప్ప చీలిక ప్రదర్శన చేశారు. ఇంత నగ్నంగా చీలిక ఎన్నడూ కనపడలేదు. అందువల్ల ఇప్పుడిక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మిత్రులు తేల్చుకోవాలి. ఎమ్మెల్యేలు తేల్చుకోవాలి. మంత్రులు తేల్చుకోవాలి. ఉండవల్లిని పదునైన తిట్లతో విమర్శించడం ఎందుకు? అది సరిపోదు. ఢిల్లీలో షిండే మోసం చేశారు. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ మోసం చేశారు. రాహు ల్, సోనియాగాంధీలు గల కోర్ కమిటీ మోసం చేసింది. దురహంకారంతో ఆధిపత్యంతో ఉండవల్లి జై ఆంధ్రవూపదేశ్ సభ మోసం చేసింది. మిమ్మల్ని వేరు చేసింది. గీతగీసి నిలబడ్డది ఆంధ్రకాంక్షిగెస్. మీ ముందు రెండే రెండు అవకాశాలు. ఒకటి కాంగ్రెస్ ఎట్లాగూ మాది కాదు. ఇక మాకు న్యాయం జరగదు. పీసీసీ అధ్యక్షునితో సహా ఎవరూ మావేపు లేరు అనుకొని ఆ పార్టీనుంచి బయటపడి తెలంగాణ ప్రజాక్షేవూతంలో జరుగుతున్న ఉద్యమంలో చేరడమా? లేదా బానిసలుగా ఉండడమా? బానిసలుగా బతుకు ఈడ్చడమా? అది తేల్చుకోవాలి గానీ ఇది గుర్రం, ఇది మైదానం అని ఉండవల్లి చెప్పినందుకు ఆయనను తిట్టడం పిరికి వాళ్ల పని. మీరు పిరికి వాళ్లా. తెలంగాణ పౌరుషం కలవాళ్లో తేల్చుకోవాల్సిన సమయం ఇదే.

ఇవన్నింటి తర్వాత తెలంగాణ ప్రజలకు, ఉద్యమానికి ఇక మిగిలింది కూడా రెండు మార్గాలే. కాంగ్రెస్ మళ్లీ ధోకా ఇచ్చింది. మోసం చేసింది. సీమాంధ్ర పెత్తందారులు చెలరేగి పోయి, విడిపోయి విషం కక్కుతున్నరు. బహుశా మన ఉద్యమం వాళ్ల మూలాలను కదిలించడం లేదు. మన ఉద్యమం సీమాంవూధుల లాబీలకన్నా శక్తివంతంగాలేదు. కనుక ఈ దశ నుంచి మరోదశకు శాంతి యుతంగానే ప్రజాస్వామ్యబద్దంగా, సమర శీలతను పెంచి వచ్చేదాకా పోరాడడమా? లేదా మనమూ బానిసలమే అని అంగీకరించి, మాటలు పడుతూ, దోపిడీ భరిస్తూ, చివరికి వాళ్లు మన గోచి కూడా వొలుచుకొనే దాకా శాశ్వత బానిసలు కావడమా తేల్చుకోవలసి ఉన్నది. ఇది సంధికాలం. సందర్భం. కానీ కేవీ రంగాడ్డి ఇట్లా అన్నాడు. ‘గులామ్‌కీ జిందగీ సే మౌత్ అచ్ఛీ హై’ బానిస బతుకు కన్నా చావు మేలు. తేల్చుకోవలసింది మనమే. ఉండవల్లి ఒక లక్ష్యం కోసం , ఉద్వేగాలు
రెచ్చగొట్టి అటు సీమాంధ్ర ప్రజలను వీధుల్లోకి రప్పించడానికి, ఇటు తెలంగాణ ప్రజలను ఇప్పటిదాకా అనుసరించిన పంథా నుంచి మరో పంథాలోకి మళ్లించడానికి పన్నిన కుట్ర. ఈ కుట్రను ఛేదించాలి. అనుకూలంగా మలుచుకోవాలి,
చివరగా అహింసకు మారు పేరని చెప్పుకునే మహాత్ముని మాటలతో
‘శాంతి, అహింస పేరిట ఆత్మాభిమానం కోల్పోవడం కంటే.. హింసపైన నమ్మకం లేకున్నా.. హింసాత్మకంగా ఉద్యమించడం మంచిది’
ఉండవల్లికి సూచన.. నిజంగానే తెలంగాణకు సంబంధించి మేము చెప్తున్న అన్ని సత్యాల్లాగానే పై మాట గాంధీ అన్న మాటే...’ సెలవు

-అల్లం నారాయణ

Wednesday, January 02, 2013

ఎటూ తేలని ‘తెలంగాణ’

ఎటూ తేలని ‘తెలంగాణ’!

(Main Feature Wednesday January 02, 2013)http://www.andhrabhoomi.net/content/e-86

అఖిలపక్ష సమావేశంలోని అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించడానికి ఇక ఆ పార్టీకి ఏ కారణం మిగలలేదు. కేంద్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి. నిజానికి ఈ రెండు పార్టీల సంఖ్యా బలం చాలు తెలంగాణ ఏర్పాటు చేయడానికి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల వరకు నిలుపుకోవడంతో పాటు టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను అడ్డుకోవడానికి తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఇంత కాలం ఉపయోగించుకుంది. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి. నర్మగర్భంగా చెప్పినా, డొంక తిరుగుడుగా చెప్పినా ప్రధాన పక్షాలేవీ సమైక్యాంధ్ర డిమాండ్ చేయలేదు. అభిప్రాయం చెప్పలేదు అంటూ కాంగ్రెస్ ఇక ఇతర పార్టీలపై నెపం నెట్టివేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిచినా, చేసే ఉద్దేశం లేకపోయినా ఇక నిర్ణయం ప్రకటించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినప్పుడు మూడు వారాల్లో కమిటీ తన నివేదిక ఇస్తుందని ప్రకటించారు. నాలుగేళ్లు అవుతున్నా ఆ కమిటీ ఉందా? లేదా? ఉంటే కమిటీ నివేదిక ఏమిటో ఇప్పటి వరకు వెల్లడించలేదు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినా, ప్రణబ్ కమిటీ అన్నా, అఖిలపక్ష సమావేశం అని చెప్పినా కాంగ్రెస్ కోరుకున్నది తెలంగాణ వ్యవహారం 2014 వరకు సాగదీయడం మాత్రమే.
అసలు ఒక నాయకుడంటూ లేక చుక్కాని లేని నావలా రాష్ట్రంలో కొట్టుకు పోతున్న కాంగ్రెస్ తెలంగాణ అంశం ద్వారా రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ డిమాండ్ అంటూ లేకపోయి ఉంటే వైఎస్‌ఆర్ మరణం తరువాత టిడిపి తిరుగులేని శక్తిగా నిలబడేది. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్లిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం వల్లనే తెలంగాణలో దూసుకెళ్లలేకపోయిం ది. టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ అంశం స్పీడ్ బ్రేకర్‌గా నిలబడింది. కాంగ్రెస్ కోరుకున్నది ఇదే. అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయాలు చెప్పలేదనో, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయనో, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అభిప్రాయం చెప్పలేదని చెబుతూనో కాంగ్రెస్ ఇంత కాలం తప్పించుకుంటూ వస్తోంది.
అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఏదో ఒక రూపంలో సుముఖత వ్యక్తం చేశాయి. ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మాటల గారడి చేయవచ్చు!
రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పక్షాలు టిడిపి, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు. రాష్ట్రంలో ఉనికి స్వల్పమే అయినా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. ఈ పార్టీలన్నీ తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పడం కాదు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉంది. ఆ పార్టీ నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేయడం కాదు, నిర్ణయాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావలసిన పరిస్థితి.
ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న సిపిఎం తమ పార్టీది సమైక్యాంధ్ర విధానపరమైన నిర్ణయం అని, అయితే తెలంగాణ ఏర్పాటును తాము అడ్డుకోమని స్పష్టంగా ప్రకటించింది. తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరింది కూడా. ఇక పాత నగరంలో ఒక మతానికి పరిమితం అయిన ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదన చేసింది. చివరకు ఈ రెండు పార్టీలు సైతం సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని కానీ చెప్పలేదు. టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, టిడిపి పార్టీలు తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాయి.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న టిడిపి 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ రాసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అఖిలపక్షంలో వెల్లడిస్తే,సీమాంధ్రలో తమకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2008 లేఖను ప్రస్తావించింది. దీని ద్వారా ఇటు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, ఇది కొత్త నిర్ణయం కాదు ఎప్పుడో 2008లో తీసుకున్న నిర్ణయం కదా అని సీమాంధ్ర నాయకులను బుజ్జగించడానికి టిడిపి ప్రయత్నించింది. 2008లో తాము తీసుకున్న నిర్ణయాన్ని జత చేస్తూ, తెలంగాణకు అనుకూలత వ్యక్తం చేసింది. ఇక లేఖ అందజేసి మాట్లాడిన టిడిపి ప్రతినిధి కడియం శ్రీహరి తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందే, రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తప్ప మరో అభిప్రాయం లేదని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. కడియం శ్రీహరి టిడిపి ప్రతినిధిగానే అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. రెండు ప్రాంతాల నాయకులు విలేఖరుల సమావేశాల్లో రెండు వైఖరులను వెల్లడించడం సహజమే కానీ కడియం పార్టీ ప్రతినిధిగానే అఖిలపక్ష సమావేశంలో వైఖరి వెల్లడించారు. అఖిలపక్షానికి వచ్చే ప్రతినిధులను పార్టీ అభిప్రాయాలను వెల్లడించమని హోంమంత్రి కోరారు కానీ లిఖిత పూర్వకంగా అభిప్రాయం చెప్పమని ఏమీ కోరలేదు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా టిడిపి పాత లేఖను తిరిగి ఇస్తే, తెలంగాణలో టిడిపిని చావుదెబ్బతీస్తేనే తమ పార్టీకి ప్రయోజనం అనే భావనతో ఉన్న టిఆర్‌ఎస్ టిడిపి స్పష్టమైన వైఖరి చెప్పలేదని విమర్శిస్తోంది. టిడిపి తన స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని హోంమంత్రి ప్రకటిస్తే, అప్పుడు టిడిపిని తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ సమావేశంలో స్పష్టమైన వైఖరి వెల్లడించి, 2008 లేఖను తిరిగి ఇవ్వడం ద్వారా టిడిపి తెలంగాణకు స్పష్టంగానే అనుకూలత వ్యక్తం చేసింది.
ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం సమైక్యవాదన వినిపించలేదు. పార్లమెంటు సమావేశంలో జగన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సోనియాగాంధీ సమక్షంలోనే సమైక్యాంధ్ర కోసం టిడిపి ఎంపిల ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అలాంటిది కీలకమైన అఖిలపక్ష సమావేశంలో మాత్రం సమైక్యాంధ్ర వాదన వినిపించలేదు. రాష్ట్ర విభజన బాధ్యతను కేంద్రంపైనే నెట్టివేసి, ఆర్టికల్ 3 ప్రకారం ఆ అధికారం కేంద్రానికే ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని నేరుగా డిమాండ్ చేయకపోయినా తెలంగాణ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదనే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిప్రాయం ఉంది. అయతే టిడిపి కంటె తెలంగాణలో తనకే పట్టు ఉంటుందన్న నమ్మకం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో సీమాంధ్రలో పార్టీ బలహీన పడకుండా ఉండాలంటే మొత్తం బాధ్యతను కాంగ్రెస్ మీద నెట్టేస్తే సరిపోతుందన్న భావన ఆ పార్టీది. అదీ కాకుండా సీమాంధ్రలో తనకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సానుకూ లత వ్యక్త్తం చేయడంతో ఆ పార్టీలో లుకలుకలు బయలుదేరితే వాటిని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న వ్యూహం కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. నిజానికి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అప్పుడే తెలుగుదేశం సీమాంధ్ర నేతల్లో అసంతృప్తులు బయలు దేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ. ఒకరకంగా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో బలపడటం మాట అట్లావుంచి సీమాం ధ్రలో పార్టీపై పడే ప్రభావం తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇక్కడ రాజకీయ చతురత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంలో కనిపి స్త్తున్నది.
చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశంలోనైనా, ఆ తరువాత పార్లమెంటు సమావేశాల్లోనూ కొన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని చెప్పారు. అలాంటి అనుమానం ఏమైనా ఉంటే అఖిలపక్షం తరువాత షిండే అదే చెప్పి ఉండాల్సింది.
కాంగ్రెస్ ఇద్దరు ప్రతినిధుల్లో ఒకరు సురేష్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సమైక్యాంధ్రను కొనసాగించాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ గాదె వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. గాదె వెంకటరెడ్డి మొదటి నుంచి సమైక్యవాదన వినిపిస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులను ఎంపిక చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాదు. అధిష్ఠానమే. కాంగ్రెస్ హై కమాండ్ అనుమతితోనే కాంగ్రెస్ ప్రతినిధులు రెండు అభిప్రాయాలను వెల్లడించారు. అధిష్ఠాన వర్గం నిర్ణయించిన కాంగ్రెస్ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన గాదె వెంకటరెడ్డి చెప్పిన విషయం కాంగ్రెస్ నిర్ణయంగా భావిస్తారు
కానీ గాదె చెప్పినట్టు ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా భావించరు. అఖిలపక్ష సమా వేశం జరిగిన తరువాత హైదరాబాద్‌కు వచ్చిన గాదె వెంకటరెడ్డి టీవి ఇంట ర్వ్యూలో హైకమాండ్‌తో మాట్లాడాను, సమావేశంలో ఏం చెప్పాలని అడిగాను. మీ అభిప్రాయం మీరు చెప్పి, చివరకు అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పండి అని చెప్పారని స్వయంగా గాదె చెప్పారు. దీన్నిబట్టి చూస్తే 2014 ఎన్నికల వరకు ప్రత్యర్థులను తెలం గాణ అంశం ద్వారా ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతు న్న దనిపిస్తోంది.
మూడు వారాల్లో నివేదిక అంటూ వేసిన ప్రణబ్ కమిటీకే నాలుగేళ్లయినా దిక్కుమొక్కూ లేదు. అలాంటిది హోంమంత్రి నెల రోజుల్లో అని చెప్పగానే నెలలో ఏదో చేసేస్తుందనే నమ్మకం తెలంగాణ కోరుకునే వారిలో కనిపించడం లేదు. నెలలో ఏదో అయిపోందని చెప్పలేం అలానే ఏమీ కాదని కూడా చెప్పలేని పరిస్థితి. ఎన్నికల నాటికి కాంగ్రెస్ తనకు లాభసాటిగా ఉండే నిర్ణయం తీసుకుంటుంది. ఈ లాభం ఎన్నికల నాటికి వేసుకునే లెక్కల్లో ఎటు మొగ్గితే లాభం అని తేలితే అటు వైపుకు అనుకూలంగా ఉంటుందనడంలో ఏమా త్రం సందేహం లేదు.