నేను ఉద్యమాన్ని..
రాజుగారి ఏడుగురు కొడుకులు, ఏడు చేపలు కథలో.. చీమ... తను కష్టపడి కట్టుకున్న పుట్టలో వేలు పెట్టిన అబ్బాయిని కుడుతుంది! తన గూడు చెదరగొట్టాలనుకున్న పిల్లాడి మీదికి చీమ తిరగబడిందన్నమాట!
పెసరుగింజంత పరిమాణంలేని చీమకే అంత పౌరుషం ఉంటే భావోద్వేగాలు ప్రకటించగల సత్తా ఉన్న ప్రజలకెంత ఉండాలి ? అందుకే తెలంగాణ గూటిని చెదరగొడుతున్న పరాయి పాలకుల మీద
తిరగబడుతున్న తెలంగాణవాదులతో ఉద్యమం తన అంతరంగాన్ని పంచుకోవాలనుకుంటుంది...
‘ప్రపంచంలో అస్తిత్వం కోసం ఆరాటం ఎన్నడు మొదలైందో ఆనాడే నేను పుట్టిన. నాటి నుంచి విప్లవం అని, ఉద్యమం అని నన్ను రకరకాలుగా పిలుచుకుంటున్నరు. కొన్ని చోట్ల నన్ను హింసగా మార్చినరు, ఇంకొన్ని చోట్ల శాంతిగా పిలిచినరు. తమ ఉనికి కోసం నా మద్దతు కోరిన అన్ని చోట్లా ప్రజలు గెలుపునే పొందినరు. ఇండిపెండెన్స్ వార్ ఆఫ్ అమెరికా, ఫ్రెంచి విప్లవం, రష్యన్ రివల్యూషన్, ఆఫ్రికా, అమెరికా సివిల్ రైట్స్ వార్ నుంచి నిన్నమొన్న జార్జియాలో వచ్చిన గులాబీ విప్లవం, టునీషియాలో వెల్లు జాస్మిన్ విప్లవం దాకా ఎన్నో చోట్ల ఎన్నెన్నో పేర్లతో నన్ను కావాలనుకున్న వాళ్లకు విజయమే వరించింది!
ఈ దేశంలో...
నాకు ..ఈ దేశానికి ఉన్న అనుబంధం రెండు శతాబ్దాలకు పైనే! బ్రిటిషర్స్ ఈ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్ననాడే నేనిక్కడ అడుగుపెట్టాను. దాదాపు వందేండ్ల పోరుకు అడుగులు పేర్చిన. ఈ దేశాన్ని దాస్యం నుంచి విడిపించిందేకు గణేశ్ ఉత్సవాలు, గ్రంథాలయ ఉద్యమాలు వంటి చిన్న చిన్న రూపాల నుంచి స్వాతంత్య్ర సమరం అనే ఉగ్రరూపందాకా చాలా ఆకారాలు దాల్చిన. అంతెందుకు అన్యాయానికి వ్యతిరేకంగా నలుగురు గూడిన చోట నేనుంటా. అట్ల ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకురావడానికి ముందుకు వచ్చిన యోధులందరికీ నా శక్తిని ధారపోసిన. దేశమంతా స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు మీకు రాలేకదా... వెంటనే సాయుధ రైతాంగ పోరాట అవతారమెత్తి మీకు కొత్త ఉత్తేజాన్నిచ్చిన. నేను పూనిన తెలంగాణ ప్రజల ఆవేశాన్ని చూసి రజాకార్లు తోకముడిచినరు. పీడ పోయింది. బిడ్డలిగ క్షేమంగ ఉంటరని నేనూ జర సల్లవడ్డ.
అదేందో రెండేండ్లకే ఈ బిడ్డల గూడు మీద ఆంధ్రోల్ల కన్నువడ్డది. మెల్లగమెల్లగ మొదలై మొత్తం ఈ జాగనే కబ్జచేసేదాకా నిద్రపోని వాళ్ల నైజం నన్ను దిగ్గున నిద్రలేపింది. తెలంగాణ బిడ్డల వీపు చరిచిన. ఉలిక్కిపడ్డరు. అప్పుడు మొదలైన నా సెగ ఇప్పటిదాకా సల్లారనే లేదు. 69లో మల్లా లేచినిలబడిన. అప్పుడు మీరే నన్ను బలంగా తయారు చేసినరు. కానీ అవతల పాలకులు నా కన్నా బలవంతులైనరు. నన్ను ఆవాహనం చేసుకుని బరిలోకి దిగిన పిలగాండ్లను పిట్టప్లూక్క కాల్చి నా రెక్కలు విరిచినరు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న కొంతమంది నా బిడ్డలే నా వెన్ను విరిసినరు. నేలకొరిగిన. కానీ చావలే! నిస్సత్తువైన మాట నిజమే కానీ మరణశయ్య మీద మాత్రం లేను. ఇప్పుడు కూడా!
బలహీనం కాలే
తెలంగాణలో నా ఊపిరి అరవై ఏండ్లది. నన్ను మోసేటోళ్లు లేక నిద్రాణంగా ఉన్ననేమో గానీ నా శ్వాస ఏనాడూ బలహీనం కాలే. సాయుధనై రణభూమిలో లేకపోవచ్చునేమో కానీ...అక్షరాన్నై సారస్వతంతో ఆవేశాన్ని ఉసిగొల్పుతూనే ఉన్న. మీ పుట్టల్లోకి కాలకూట విషాన్ని చిమ్మే నాగులు చేరాయని రొదపెడ్తనే ఉన్న. నాటికీ...నేటికీ తరం మారింది. ఆలోచనలూ మారాయి. ప్రభుత్వాలూ మారాయి. మీడియా విస్తృతమైంది. నన్ను హింసకాసారంలా మారొద్దన్నరు. శాంతించమనే ప్రార్థించినరు. సరేనని నా గుణం కాని సహనాన్ని ఆపాదించుకున్న.
పాలకులు దానికి పరీక్ష పెడుతున్నరు. న్యాయానికి అండగా ఉండాల్సిన మీడియా కూడా రకరకాల కామెంట్లతో నన్ను అపహాస్యం చేస్తున్నది. ఆఖరుకు నన్ను ఒక వినోదంలా చూపిస్తున్నది. నన్ను హేళన చేయడం భరించలేని చాలామంది బిడ్డలు ఆత్మబలిదానాలర్పిస్తున్నరు. కానీ నేను కోరుకున్నది ఇది కాదు. మీ వెనక నేనున్నానంటే ఎట్లుండాలే..సింహాలై గర్జించాలే. కానీ నా బిడ్డలు సున్నిత మనస్కులు. అందుకే వాళ్ల వికృత చేష్టలకు గుండె జార విడుచుకుంటున్నరు. అయినా సర్కారులో చలనం లేదు. నన్ను తామే మోస్తున్నమనే భ్రమలో ఉన్న తెలంగాణ నేతల్లో కూడా చలనం లేదు. అయినా నేను ఓపికగా ఉన్న. అందరూ నన్ను అపార్థం చేసుకున్నరు. నాలో చేవ చచ్చిందని అనుకున్నరు. లాభంలేదనుకుని నేనేందో నిరూపించదలిచిన. నా చలనాన్ని చూపించడానికే ఈ రోజు ట్యాంక్‌బండ్‌ను వేదిక చేసుకున్న. గన్ పార్క్‌లో ఉన్న నా బిడ్డల వీర మరణ జ్ఞాపికను ఒకసారి స్పృశించి నా కదలికను చూపిస్త. శాంతిగానే! నన్ను విజయవంతం చేయాల్సిన బాధ్యత మీదే. నేనిప్పుడు మీ చేతుల్లోనే ఉన్న.
సాహసంతోనే సహవాసం
భయానికి నాకు ఎన్నడూ పొత్తు లేదు. జంకు ఉన్న చోట నేనసలు ఉండనే ఉండ. నాకు సాహసంతోనే సహవాసం. పౌరుషానికి మీరంతా పెట్టింది పేరు. నన్ను మోస్తున్న మీరంతా సాహసవంతులే! కాబట్టే 60 ఏండ్ల నుంచి మీ పంచనే ఉంటున్న. మీకు విజయం వరించేదాకా నిద్రపోను. నన్ను మీ నుంచి దూరం చేయడానికి సర్కారు రకరకాల జిత్తులు ప్లే చేస్తున్నది. నాతో చెలిమి చేసేటోళ్లను అరెస్ట్ చేస్తానని బెదిరించింది. నన్ను ఆలింగనం చేసుకున్న కొంతమందిని జైల్లో పెట్టింది కూడా. నన్ను వదిలేసి మీరు పారిపోవడానికి రబ్బరు బుల్లెట్టు, టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగిస్తది. గందరగోళ ప్రకటనలతో మిమ్మల్ని నిస్సహాయులను చేసి నన్ను అశక్తురాలిని చేయాలనుకుంటది.
ఒక్కమాట...
ఇప్పుడు మీరు ఏ మాత్రం వెనక్కి తగ్గినా నేను అచేతనమవడం ఖాయం. అది నాకు చావులాంటిదే. ఒక్కసారి మీ నుంచి నేను విడివడితే మళ్లీ మీతో జతకట్టే అవకాశం ఉండదు. మీ గూడు మీకు దక్కే ఛాన్సూ రాదు. ప్రపంచంలోని మిగతా చోట్ల నేను ఎలా ఉన్నా...ఇక్కడ నా స్వరూప, స్వభావాలు ప్రత్యేకం. లోకంలో నా ఊసే లేని సమయంలో కూడా మీ దగ్గర (60 ఏండ్ల నుంచి) నేను బలంగా ఉన్నా. కారణం...ఇక్కడ మీరు అనుభవిస్తున్న పరిస్థితులు. మీ తలరాతను మీరే మార్చుకోవాలి. వలస పాలకులు మార్చరు. బ్రిటిషర్స్ లాగా వాళ్లకు ఇక్కడ సంపదే కావాలి, మీ యోగక్షేమాలు కాదు. మీ అస్తిత్వం వాళ్లకు అనవసరం కాబట్టి అది లేకుండా చేయడానికే ప్రయత్నిస్తారు. మీ ఉనికి చాటుకోవడానికి ఈ కవాతు గొప్ప అవకాశం. సాగరంలా ట్యాంక్ బండ్‌ను పర్చుకోండి...నేను సజీవంగా ఉన్నానని చాటండి!