Saturday, September 08, 2012

తటస్థులెవరు? తెలంగాణపై సీమాంధ్ర మీడియా మాయాజాలం

తటస్థులెవరు?
scales-copy
తెలంగాణపై సీమాంధ్ర మీడియా మాయాజాలం
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=149524

  తెలంగాణకు ఒకలా.. సీమాంవూధకు మరోలా
మధ్యస్తంగా హైదరాబాద్‌లో
వార్తారచనల్లో విచిత్ర వైరుధ్యాలు
సీమాంవూధలో కనిపించని తెలంగాణ ఘటనలు
ఇక్కడి సంచలనాలకూ అక్కడ చోటు లేదు
సమైక్యవాదానికే పెద్ద పీట
తెలంగాణ గోస పట్టని మీడియా
మాన్యుఫాక్షరింగ్ కన్సెంట్
కొత్త పుంతలు తొక్కుతున్న వివక్ష

(టీ మీడియా, విజయవాడ, హైదరాబాద్) :అవి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లే పత్రికలు. సమాచారం అనేది ఏ ప్రాంతానికైనా ఒకటే. సమస్యను సమస్యలా చూడటం, సమస్యను ప్రజలకు చూపించడం మీడియా ధర్మం. దీనికి ఆ పత్రికలు ఒప్పుకుంటాయి. పత్రికలకు ప్రాంతాలన్నీ సమానమేననీ చెబుతాయి. కానీ.. ఒక ప్రాంతం మాత్రం తక్కువ సమానం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ తమకు ముఖ్యమేనని చెప్పుకుంటాయి. కానీ.. ఒక ప్రాంతం పట్ల మాత్రం ఉదాసీనత. వాటికి ఒక ప్రాంతంలోని సమస్యలే కనిపిస్తాయి.. వినిపిస్తాయి. అవే ప్రధాన వార్తలుగా పతాక శీర్షికలు ఎక్కుతాయి. కాదు.. కాదు ఎక్కిస్తారు. వాటినే పదే పదే మీడియాలో చూపిస్తారు. నిజం నిష్టూరంగానే ఉంటుంది. ఆ నిజం.. ఒక ప్రాంతం పట్ల నిర్లక్ష్యం. పట్టరానితనం. ఆ ప్రాంతపు అస్థిత్వ, ఆత్మగౌరవ పోరాటాలు ఆ పత్రికలకు ప్రధానాంశాలు కావు. ఆ ప్రాంతపు ఆవేదనలు ఆ పత్రికలకు అవసరం లేనివి. ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న దగా.. వాటి దృష్టిలో అంత ప్రముఖంగా ప్రస్తావించాల్సినదేమీ కాదు. పత్రికలు అమ్ముకోడానికి ఆ మార్కెట్ కావాలి. కానీ.. ఆ ‘మ్కాట్’లో జరిగే పరిణామాలు మాత్రం అవసరం లేదు. ఇదీ సీమాంధ్ర గుత్త పెట్టుబడిదారీ రాజకీయ వర్గ దుర్గాదుల గుప్పిట్లో ఉన్న పత్రికలు తెలంగాణ ప్రాంతం పట్ల అనుసరిస్తున్న వైఖరి. సదరు పత్రికలు ప్రచురించే వార్తల్లో అంతర్లీనంగా దాగి ఉండే సత్యం. థాట్‌పోలీసింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు సీమాంధ్ర పత్రికల లక్ష్యం.. వార్తల మేనేజ్‌మెంట్. ’మాన్యుఫాక్షరింగ్ కన్సెంట్’. తాము తటస్థ వైఖరితో ఉంటామని చెప్పుకునే కొన్ని పత్రికలు.. నిజానికి పక్షపాతాన్నే అనుసరిస్తున్నాయన్నది వాస్తవం. ఒకప్పడు అన్ని ప్రాంతాలకూ ఒకే తరహా పేజీ వెళ్లే రోజుల నుంచి.. ప్రాంతాలకు అనుగుణంగా పేజీలు, మొదటి పేజీల తయారీగా మారి.. కాలక్షికమేణా ఒక ప్రాంత పాఠకులే లక్ష్యంగా తయారవుతున్న విషాదకర వాస్తవానికి ఈ కాలం సాక్షీభూతం.

కొన్ని నాలుగడుగులు ముందుకేసినవీ ఉన్నాయి. సీమాంవూధకు ఒక తరహా వార్తా రచన.. తెలంగాణ ప్రాంతానికి మరో తరహా వార్తా రచన. ఒకటి సాదాసీదాగా తేలిపోతే.. మరోటి వీరంగం వేస్తుంది. మరి హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల వారూ ఉన్నారుగా.. కనుక నగరంలో సర్క్యులేట్ అయ్యే కాపీలకు విభిన్న తరహా వార్తా రచన. ఎటూ కాకుండా.. నొప్పించక తానొవ్వక! తెలంగాణ ప్రాంతంలోనే కాదు.. రాష్ట్రంలోనే ఒక మేధావిగా పేర్గాంచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చనిపోతే.. అనేకానేక తరహా వార్తా రచనలను రాష్ట్రం చూసిందని పలువురు గుర్తు చేస్తున్నారు. ఒక ప్రాంతంలో మొదటి పేజీలో వచ్చిన వార్త.. ప్రాంతం మారేసరికి.. లోపల ఎక్కడికో వెళ్లిపోయిన సందర్భం. ఒక ప్రాంతంలో పేజీ అంతా ఆక్రమించి వార్త.. మరో ప్రాంతంలో అప్రాధాన్యమైపోయిన వైచిత్రి. తెలంగాణ వెలుగుల స్థానమెక్కడని ప్రశ్నించిన ఆందోళనకారులు.. ట్యాంక్‌బండ్‌పై ‘ఆంధ్ర’ వెలుగుల విగ్రహాలపై దాడి చేస్తే.. ఒక ప్రాంతంలో వీరోచిత రచన.. మరో ప్రాంతంలో నిందాపూర్వక కథనం. తెలంగాణ కోసం చేసుకునే ఆత్మహత్యలకు పెద్ద అక్షరాలతో శీర్షికలు.. అవే వార్తలు సీమాంధ్ర ఎడిషన్లకు వస్తే.. ఎక్కడో సింగిల్ కాలం వార్తలు. కొన్నైతే కనిపించనే కనిపించని తెలంగాణ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విద్యుత్ సౌధను ముట్టడిస్తే సీమాంధ్ర ప్రాంత ఎడషన్లలో అదో సింగిల్‌కాలం వార్త. రాష్ట్రంలో ఓ ప్రధాన రాజకీయ పార్టీ.. ఓ ప్రాంతంలోని ప్రధాన సమస్యపై చేసిన ఆందోళనకు ఇచ్చిన ప్రాధాన్యం అది. అదే సమయంలో తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటైతే అది అత్యంత ప్రాముఖ్యం ఉన్న వార్తగా మారిపోతుంది. ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలు రాత్రుళ్లు డిన్నర్ల పేరుతో తెలంగాణను అడ్డుకునేందుకు కుతంవూతాలు నడిపితే సమైక్యాంధ్ర కోసం ఏకతాటిపైకి వచ్చారంటూ పెద్ద అక్షరాలతో మొదటిపేజీల్లో ఆక్రమిస్తాయి. రాష్ట్రంలో దాదాపు ఎక్కడా ఇంత తీవ్రతతో లేని ఫ్లోరైడ్ సమస్యపై బాధితులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో బృందం పరామర్శించింది. రాజకీయాలకు అతీతమైన ఈ వ్యవహారం మానవతావాదానికి సంబంధించినది. మంచిగా ఎదగాల్సిన పిల్లలు.. అష్టావక్షికలై భవితవ్యం ప్రశ్నార్థకమై నరకయాతన అనుభవిస్తున్నారు.

దానికి కారణం ఫ్లోరిన్ అత్యధికంగా ఉంటున్న నీరు. మానవత్వంతో స్పందించాల్సిన అంశమిది. కానీ.. నాదెండ్ల మనోహర్ బృందం పర్యటన సీమాంధ్ర ఎడిషన్లలో తగిన ప్రాధాన్యం పొందలేక పోయిందని అంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాదీ ఈ విషయంలో అదే తీరు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దుర్గ గుడి వద్ద ఫ్లైవోవర్ కోసం ధర్నా చేస్తే.. దానికి ప్రతిగా ఫ్లైవోవర్ వద్దంటూ స్థానిక ఎంపీ లగడపాటి పోటీ ధర్నాకు దిగితే అది రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంలా రంగుపులిమి.. రంగుల డబ్బాలు ఊదరగొట్టగా.. సీమాంధ్ర పత్రికలూ అంతకు మించిన వార్త లేదనుకున్నాయి. ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు ఇది కూడా పోయింది. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన ఆ కొద్దిపాటి మినహాయింపులు కూడా మాయమైనట్లున్నాయంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాధాన్యమే తెలంగాణ ప్రాంతానికీ.. సీమాంధ్ర ఎడిషనే తెలంగాణకూ..

మెడికల్ కాలేజీల సీట్ల వ్యవహారమే చూద్దాం. సీమాంవూధలోని మూడు కాలేజీలకు (విశాఖ, విజయవాడ, కర్నూలు) అదనపు మెడికల్ సీట్లు వస్తే.. రాష్ట్రానికి 150 సీట్లు వచ్చాయని రాశాయేకానీ.. తెలంగాణలో అర్హత ఉన్న కాలేజీలకు సీట్లు పెరగకపోవడాన్ని కనీసంగానైనా ప్రస్తావించలేక పోయాయి. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, సీమాంవూధలోని కాలేజీల్లోసైతం దాదాపు ఇవే చిన్నపాటిలోపాలున్నా.. వాటికి సీట్లు కేటాయించిన మెడికల్ కౌన్సిల్, తెలంగాణ ప్రాంతం పట్ల మాత్రం వివక్ష చూపిందని సూటిగా విమర్శ చేయలేకపోయిన వైనం. తెలంగాణకు జరిగిన అన్యాయం ప్రస్తావనార్హం కాదా? ఏమనాలె దీన్ని? సీట్లు రాకపోవడానికి ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని కనీసంగా ఎత్తిచూపలేని తటస్థత. ప్రభుత్వం కొంచెం శ్రమించి, చొరవ చేస్తే తెలంగాణ ప్రాంతానికి అదనపు మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నా.. ఆ జాప్యాన్ని నిలదీయని తటస్థ వైఖరిని తెలంగాణవాదులు నిగ్గదీస్తున్నారు.

తెలంగాణ దాహార్తిని పణంగా పెట్టి.. కృష్ణా డెల్టాకు నీరిచ్చిన దారుణంలోనూ అదే ధోరణి. ఒకవైపు మా గొంతుపూండిపోతున్నాయి తండ్రీ.. అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం.. తన మానాన తాను నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి మరీ కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నీటిని దోచిపెడుతున్నా.. ఇది అన్యాయం అనడానికి అక్షరాలు కూర్చని తటస్థత. తెలంగాణ ప్రాంత నీటి హక్కును రక్షిస్తూ కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి నీళ్లివ్వొద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెబితే.. అది లోపలి పేజీల్లో ఓ సింగిల్ కాలానికి పరిమితమైపోయిన పరిస్థితి. కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు ఇస్తే.. అదేదో సంబరమన్నట్లు ప్రకటించిన సీమాంధ్ర పత్రికలు.. అదే ఉత్తర్వుతో కడుపు భగ్గున మండిన తెలంగాణ కష్టాన్ని మాత్రం పెద్దగా పట్టించుకున్నది లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
పక్కనే నదులున్నా.. పారే దిక్కులేక.. బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాల్సిన స్థితిలో కీలకమైన కరెంటు కోతలతో తెలంగాణ రైతాంగం అల్లల్లాడినప్పుడూ సీమాంధ్ర పత్రికలుపట్టించుకున్న పాపాన పోలేదు. ఈ సమస్యపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షకు పూనుకుంటే ప్రభుత్వం ముందే అరెస్టులతో వాటిని సాగనీయలేదు. తెలంగాణ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై ఈ ప్రాంతానికి చెందిన వారిగా బాధ్యత కలిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షకు దిగే అర్హత లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది. అదే సమయంలో రాష్ట్ర నేతలుగా చెలామణీ అవుతున్న సీమాంధ్ర ప్రాంత నేతలు తెలంగాణలో దీక్షలకు, యాత్రలకు, జైత్రయావూతలకు వస్తే.. అతిథి మర్యాదలు చేసి పంపిన పోలీసులు.. తెలంగాణ ప్రాంత నేతలు ఆందోళనకు దిగితే మాత్రం సహించకపోవటాన్ని ప్రస్తావించిన సీమాంధ్ర పత్రిక ఏదైనా ఉన్నదా? అని తెలంగాణవాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సమస్యలే కాదు.. తెలంగాణ ప్రాంత రాజకీయ ఆందోళనలపైనా సీమాంధ్ర పత్రికలది అదే తీరని విమర్శిస్తున్నారు తెలంగాణ ప్రాంత విశ్లేషకులు. మొన్నటికి మొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణ ప్రజాపోరు యాత్ర పేరుతో తెలంగాణ జిల్లాలు చుట్టి.. హన్మకొండలో సభ పెట్టినా.. తెలంగాణ సాధన కోసం జాతీయ స్థాయిలో బీజేపీ ఢిల్లీలో దీక్షకు పూనినా తూతూ మంత్రపు కవరేజీ. ఢిల్లీలో తెలంగాణ మార్చ్‌పై వాటర్‌కానన్లు, లాఠీలు ప్రయోగిస్తే.. ఒక మూల చిన్న ఫొటో. కానీ సీమాంధ్ర ఎంపీలు ప్రధానిని కలిస్తే పతాకశీర్షికలే. ఇదీ సీమాంధ్ర పత్రికల ‘తటస్థ’ వైఖరి.? ఏమిటీ వివక్ష అన్నదే ఇప్పటి తెలంగాణవాదుల ప్రశ్న.

ఈ పరిస్థితి మారాలన్నదే సగటు తెలంగాణవాది ఆకాంక్ష. మా వార్తలు ఇతర ప్రాంతాలవారికి చూపకపోయినా ఫర్లేదు.. కనీసం మాకైనా చూపించండని వేడుకుంటున్నాడు సగటు తెలంగాణ పౌరుడు. ఇకనైనా సీమాంధ్ర మీడియా నైజం మారకపోతే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా తెలంగాణ వార్తలు.. తెలంగాణ ఆవేదనలు.. ఇచ్చితీరాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు తెలంగాణ ప్రాంత మేధావులు.. వాస్తవానికి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి ప్రజలు సముఖంగానే ఉన్నారు. విడిపోతే నష్టమేంటంటూ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆలోచనలను మీడియాలో ముద్రించని పత్రికలు, నేతల సమైక్య ప్రవచనాలను మాత్రం జిల్లా టాబ్లాయిడ్‌తో పాటు మెయిన్‌లోనూ రెండేసి చొప్పున ముద్రిస్తున్నాయి.
డెల్టాకు సాగునీటిని విడుదల చేయాలని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ జూన్ 28న రాత్రి పది మందితో కలిసి బ్యారేజీ దిగువన ధర్నాకు ఉపక్షికమిస్తే.. అదో పెద్ద సంచలనం. కానీ.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటి విడుదలకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగితే.. నింద మోపటం. డెల్టాకు సాగునీటి కోసం ఇటీవల ప్రకాశం బ్యారేజీ దిగువన లక్ష మందితో ధర్నా అని టీడీపీ ప్రచారం చేసుకుంది. లక్షలు కాదు కదా.. వేల సంఖ్యలో కూడా రైతులు రాలేదు. సుమారు రెండువేల కుర్చీలు వేస్తే.. అవి నిండటం కనాకష్టమైంది. అయినా.. అదో అద్భుత ఆందోళనగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఊదరగొ ఆరోపణలున్నాయి.
నిజానికి ప్రకాశం బ్యారేజీ అసలు ఎత్తు కేవలం 12 అడుగులు మాత్రమే. ప్రకాశం బ్యారేజీ నిండా ఎప్పుడూ నీరు ఉంటుంది. బ్యారేజీలో 11 అడుగులు నీరు ఉంటే ఎన్టీపీకి విద్యుత్ ఉత్పత్తికి నీరు ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే కాలువలకు ఏడు అడుగుల వరకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నేతలు మాత్రం ఎన్టీపీసీకి నీరు ఇవ్వాలి.. డెల్టాకూ పారించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా ఉండాలికానీ.. సాగర్ రిజర్వాయర్ కడుపు మాత్రం ఖాళీ అయిపోవాలన్నదే సీమాంధ్ర నేతల డిమాండ్. దీనికి మాత్రం సీమాంధ్ర మీడియా ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. సాగర్ రిజర్వాయర్‌ను ఖాళీ చేసైనా.. 440 అడుగుల వరకు నీరు ఉన్నా డెల్టాకు నీరు ఇవ్వాల్సిందే అంటూ మాజీ మంత్రి వడ్డే శోభనావూదీశ్వరరావు డిమాండ్ చేస్తే దానికి ఎక్కడలేని ప్రాముఖ్యం ఇచ్చే మీడియా.. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులకు తాగటానికి మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదన్న వాస్తవాన్ని మాత్రం పట్టించుకోదు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సీజన్‌కు నీరు ఎందుకు ఇవ్వటం లేదని సీమాంధ్ర మీడియా ప్రశ్నించిన సందర్భాలను వెతుక్కోవాల్సిందే. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తే పట్టించుకునే మీడియా.. నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు అతీగతీలేకుండా పడి ఉంటే.. కదిలిద్దామన్న స్పృహే కనిపించదు.
సీమాంవూధలో పట్టుమని పది మంది కూడా లేని సమైక్యాంధ్ర ఆందోళనలకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించే మీడియా.. ఇదే ప్రాంతంలో జై ఆంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమాన్ని చూడటానికి కూడా నిరాకరిస్తుండటం విశేషం. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణవాదులందరూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. సీమాంవూధలో మాత్రం తొలుత జై ఆంధ్ర ఎగసిపడింది. ఆ తర్వాత అది సమైక్యాంవూధగా మారింది. కేవలం నేతలకు మాత్రమే పరిమితమైన ఈ పరిణామక్షికమానికి ఏమిటీ నేపథ్యం అన్న అంశంపై లోతులకు వెళ్లే ఆలోచనే చేయదు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా జై ఆంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్న వసంత నాగేశ్వరరావు వంటి ప్రముఖల వార్తలకు అసలు ప్రాధాన్యం ఉండదు. వేస్తే ఎక్కడో జోన్ పేజీలో. ఇదీ రాష్ట్రంలో ‘తటస్థ’ మీడియా అసలు స్వరూపం. పెట్టుబడిదారీ నేతల గుప్పిట్లో సాగుతున్న సమైక్యాంధ్ర సిద్ధాంతాలకు.. తెలంగాణ పట్ల గుడ్డి వ్యతిరేకతకు నిలయాలవుతున్న సీమాంధ్ర మీడియా స్వభావం. ఇదీ సంగతి.. ఇదం జగత్.. ఇలా ఉంది లోకం తీరు.

No comments:

Post a Comment