విధి విధానాలు
1. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడం.
2. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం నుంచీ సంభవించిన పరిణామాల సమీక్ష. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాధించిన ప్రగతి, అభివృద్ధిపై ఈ పరిణామాలు చూపిన ప్రభావాన్ని అధ్యయనం చేయడం.
3. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలు తెగల ప్రజలపై ఇటీవలి పరిణామాలు చూపిన ప్రభావాన్ని అధ్యయనం చేయడం.
4. మొదటి మూడు విధివిధానాల్లో ప్రస్తావించిన అంశాలను పరిశీలించే సమయంలో పరిష్కరించాల్సిన కీలకాంశాలను గుర్తించటం.
5. పైన ప్రస్తావించిన అంశాలపై సమాజంలోని అన్ని వర్గాలు ముఖ్యంగా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపటం, వారి అభిప్రాయాలు తెలుసుకోవటం. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులను పరిష్కరించుట, దీంతోపాటు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ వారి సంక్షేమాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ పరిష్కార మార్గాలను ఆయా రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల నుంచి కోరటం. ఈ లక్ష్య సాధన కోసం అందరికీ ఆమోదయోగ్యమైన సర్వోత్తమ పరిష్కారాలను గుర్తించి, దీనికోసం కార్యచరణ ప్రణాళిక, రోడ్ మ్యాప్‌ను సిఫారసు చేయడం.
6. పైన ప్రస్తావించిన అంశాలపై పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రైతుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి వారి అభిప్రాయాలను తెలుసుకొనడం.
7. కమిటీ తాను భావించే ఇతర సూచనలు, సిఫారసులు చేయుట.
కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి 2010 డిసెంబర్ 31లోగా అందజేయాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment