Thursday, March 07, 2013

తెలంగాణ తండ్లాట


http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=214119

తెలంగాణ తండ్లాట

telangaana

- పశ్నల పందిరి కింద ప్రత్యేక ఆకాంక్ష

-ఎప్పుడొస్తది తెలంగాణ?

-జాప్యానికి కారణం ఎవరు..

-ఉద్యమంలో ఎందుకీ స్తబ్ధత..

-జవాబు కోసం జనం అన్వేషణ
-400 బలిదానాల తొలిదశ పోరు

-వేయి ఆత్మత్యాగాలతో నేడు కత్తుల వంతెన మీద..

-ఆకాంక్షమేరకు సాగని ఉద్యమం

-జనం కదిలితే.. కలిసొచ్చే నాయకత్వం

-అందులోనూ ఓట్ల రాజకీయం

-ఎన్నికలవైపు మళ్లించే యత్నాలు

-సమిష్టి ప్రయోజనాలు పట్టని నేతలు

-అందరిదీ తెలంగాణ జెండాయేకానీ.. ఎవరి ఎజెండా వారిదే

-ఐక్యపోరాటాలే రాష్ట్ర సాధన సోపానాలు

-మొత్తుకుంటున్న తెలంగాణ జనం



ఒకటే లక్ష్యం.. రెండు ఉద్యమకాలాలు.. మూడేళ్లుగా ఎగసిపడుతున్న పోరు కెరటం.. నాలుగు కోట్ల ప్రజల హృదయ స్పందన.. ఐదు దశాబ్దాలుగా రగులుతున్న ఆకాంక్ష! ఇది తెలంగాణ తండ్లాట! స్వయం పాలనకోసం.. కోల్పోయిన ఆత్మగౌరవం సాధనకోసం.. అభివృద్ధికోసం.. దోపిడీ నుంచి విముక్తికోసం! 1969నాటి ఉద్యమ బలిదానాల నెత్తురు ఇంకనేలేదు! మా తెలంగాణ మాకు కావాలంటూ తెలంగాణ పది జిల్లాల్లో కలియదిరుగుతున్న అకుంఠిత కార్యకర్తల పాదధూళి.. పల్లె పల్లెనూ పలకరిస్తూనే ఉంది! రాష్ట్ర సాధనే తప్ప మరే స్వార్థమూ లేని వేయి మందికిపైగా మెరికల్లాంటి తెలంగాణ యువచైతన్యాలు ఆత్మాహుతితో ఉద్యమాన్ని పునీతం చేస్తే.. ఆ తల్లిదంవూడుల కంట కారిన నీరు ఇంకా ఘనీభవించనే లేదు! ఉద్యమానికి దూరంగా వనవాసంలో ఒకరు.. ఆకాంక్షలు పట్టక అజ్ఞాతంలో మరొకరు.. సమర క్షేత్రాలను వదిలేసి.. ప్రవాసానికి ఇంకొకరు! తెచ్చేది ఇచ్చేది మేమేనని ఒకరు.. తెచ్చేందుకే వచ్చామని ఒకరు.. వస్తే ఇస్తామంటూ ఒకరు! ఇచ్చినా.. ఇవ్వకున్నా మాదేముందని మరికొందరు! ఏమైతేనేం.. ఏవైతేనేం? ఒకటి రెండు మినహాయింపు.. అన్ని పార్టీల నినాదమూ తెలంగాణ సాధనే! అన్ని సంఘాల పోరాటమూ తెలంగాణ కోసమే! అయినా ఇంకా ఎందుకు రాదు తెలంగాణ? ఎందుకీ జాప్యం? కీలక మజిలీకి చేరుకున్న సమయాన.. ఉద్యమ ప్రభంజనాలు పోటెత్తాల్సిన చోట.. ఎందుకీ నిర్వేదం? లోపం ఎవరిది? దోషమెక్కడ? తెలంగాణను అడ్డుకుంటున్న మాయల మరాఠి.. సప్తసమువూదాల ఆవల మర్రిచెట్టు తొర్రలోని చిలుకలో దాచుకున్న ఆయువుపట్టును దెబ్బకొట్టే ధీరుడెవ్వడు? తెలంగాణపై కమ్ముకున్న ప్రశ్నల మబ్బులు వీడిపోయేదెన్నడు? తెలంగాణ విడిపడేదెన్నడు? సహస్ర ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నమిది!
srikanth



(టీ మీడియా, హైదరాబాద్):దశాబ్దాల ప్రశ్న ఒకటే! ఎప్పుడొస్తది తెలంగాణ? ఉద్యమం నానాటికీ విస్తరించి.. ఫోను మోగినా జై తెలంగాణ నాదం రింగురింగుమనే సమయాన.. ఒకటే సందేహం.. ఇంకా ఎందుకు రావటం లేదు తెలంగాణ? ప్రశ్న క్లిష్టమైనదే! కానీ.. జవాబు సంక్లిష్టమైనది కాదు! ఇక్కడ ఉద్యమ చైతన్యం నిత్యం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కానీ.. రాజకీయ చిత్తశుద్ధి లేదన్నదే జనం ఆవేదన! కాంగ్రెస్ మొదలుకుని.. టీఆర్‌ఎస్.. బీజేపీ.. టీడీపీ.. సీపీఐ.. న్యూడెమోక్షికసీ..! ఎవరి ఎజెండా వారిదే. ఉద్యమం ఆసరాగా వచ్చే ఓట్లెన్ని? ఆకాంక్ష పేరు చెప్పి వెనకేసుకునే సీట్లెన్ని? సంఘం నుంచి ఉద్యమ సోపానం ఎక్కి.. అసెంబ్లీకి వెళ్లేదెలా? మొత్తంగా ఎన్నికల దిశగా ఉద్యమాన్ని నెట్టే ప్రయత్నమే! ఢిల్లీలో ఒక కదలిక వచ్చినప్పుడో.. డీలాపడిన ఓ అమాయకుడు ప్రాణత్యాగం చేస్తేనో.. ఆగ్రహించిన జనం పోటెత్తితేనో.. అప్పుడే రాజకీయ నాయకుల్లో కదలిక! ఎవరో ఒకరు పిలుపునిస్తే.. కాలం బాగుంటే మిగిలినవాళ్లు కలిసి వస్తారు! లేదంటే కటిక నిశ్శబ్దం! ఇట్లైతే తెలంగాణ ఎట్లొస్తది? ఇది సమస్త తెలంగాణ ప్రజలు సంధిస్తున్న ప్రశ్న!



1969లో తెలంగాణ ఉద్యమం ఉప్పొంగింది. సమైక్యవాదం బూటకమేనని తొలినాళ్లలోనే తేలిపోయిన తర్వాత.. తెలంగాణం తిరగబడ్డది! మా రాష్ట్రం మాకు కావాలంటూ గొంతెత్తింది. సహించని కాంగ్రెస్ సమైక్యపాలన.. ఉద్యమాన్ని అణచివేసింది. తుపాకులు ఎక్కుపెట్టి.. రాజధాని నగరం నడిబొడ్డున 369 మంది యువకులు.. స్కూలు పిల్లలను నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసింది! నాయకత్వానికి ‘రాజకీయం ప్రతిఫలం’ చెల్లించి కొనేసింది! ఉద్యమాన్ని బొందబెట్టింది. కొన ఊపిరితో ఉన్న ఉద్యమ ప్రాణం.. మిణుకుమిణుకుమంటూనే దశాబ్దాలుగా విస్తరించి.. నేడు మహోన్నత కాగడా అయ్యింది! కోట్ల మంది ఉద్యమశక్తులకు మార్గం చూపుతున్నది. అయితే.. ఆ మార్గాన్ని అనుసరించే క్రమంలో రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌పై సాగే ధర్మయుద్ధాన్ని మరింత బాధ్యతతో ముందుకు తీసుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘల నాయకత్వం.. సంకుచిత భావాలతో.. తిరోగమన దిశలో పయనించడం వల్లే ప్రస్తుతం ఉద్యమంలో స్తబ్దత ఏర్పడిందన్న విమర్శ బలంగానే వినిపిస్తున్నది. ఈ స్తబ్దతకు కారకులవుతున్నవారిపై జనం తిరుగుబాటు చేసే పరిస్థితులూ తలెత్తుతున్నాయి.



విద్యార్థులు.. వైద్యులు.. న్యాయవాదులు.. కార్మికులు.. అధ్యాపకులు.. ఒక్కరేమిటి? తెలంగాణ సాధనకు సబ్బండ వర్ణాలూ సమరశంఖం ఊదుతున్నాయి. గ్రామక్షిగామాన సంయుక్త కార్యాచరణ కమిటీలుగా ఏర్పడి.. ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నాయి. మరోవైపు ఉద్యమానికి మునుపెన్నడూ లేనంత.. ఏ ఉద్యమానికీ లేనంత మేధో సంపత్తి.. మార్గనిర్దేశం చేసేందుకు ముందుకు వచ్చింది! కానీ.. ఆ బాసటను ఉపయోగించుకునే నాయకత్వం ఎక్కడ? ఆ మేధోసంపత్తి పంచే విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. ఆయుధాలను పదునుపెట్టుకునే సైనికుపూక్కడ? ఇది ముమ్మాటికీ నాయకత్వ వైఫల్యమేనన్నది సమస్త ప్రజలు చేస్తున్న విమర్శ! ఉద్యమం అంటూ అలజడి సృష్టించి.. అజ్ఞాతంలోకి వెళ్లేవారు కొందరైతే.. అప్పుడప్పుడూ తీవ్రమైన ప్రకటనలు చేసి.. వనవాసానికి వెళ్లిపోయే నేతలు మరికొందరు! మరికొందరు ఇవేవీ పట్టనట్లు ఏకంగా ప్రవాసానికి వెళ్లిపోతున్నారు. దీని వల్లే కేంద్రంపై తగినంత ఒత్తిడి పెరగడం లేదన్న విశ్లేషణలు ఉద్యమ మేధావుల నుంచి వినిపిస్తున్నాయి.



తెలంగాణ సాధన కోసమే పుట్టిన టీఆర్‌ఎస్.. గతంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని.. ఇప్పటికీ తెలంగాణ ఇస్తామని నమ్మబలుకుతున్న కాంగ్రెస్.. తెలంగాణకు జై కొట్టి.. టీఆర్‌ఎస్‌కు స్నేహహస్తం అందించిన టీడీపీ.. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామంటున్న బీజేపీ.. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్న సీపీఐ..న్యూడెమోక్షికసీ.. పార్టీలు ఏవైనా అంతిమంగా వాటి దృష్టి.. ఓట్లు సీట్లపైనే ఉంటున్నదన్న విమర్శ బలంగా ఉంది. ఉద్యమంలో కూడా ఈ పార్టీలు ఎవరి దోవ వారిదేనన్నట్లు వ్యవహరిస్తాయే తప్ప.. సమన్వయంతో.. సమ్మిళిత ఆకాంక్షలతో ఉద్యమాన్ని దూకిస్తున్న ఉదంతాలు లేవనే వాదన ఉంది. గడిచిన కాలంలో జరిగిన ఉప ఎన్నికలే దీనికి నిదర్శనమని పలువురు చెబుతున్నారు. గతంలోనూ రాజకీయాలే తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యాయని మేధావులు గుర్తు చేస్తున్నారు. వైఎస్ తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాలతో పార్టీ అధినేత్రి సోనియాకు వినతిపత్రం సమర్పించడం వెనుక.. అధికార పగ్గాలు చేప తెలంగాణను ఒక సాధనంగా భావించిన రాజకీయ అంశమే కనిపిస్తుంది.



తొమ్మిదేళ్ల అధికార దాహాన్ని తీర్చుకునేందుకు 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ జతకట్టడానికి ప్రధాన కారణం.. నాటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి.. తాము అధికారంలోకి రావాలన్న తపనే! ఐదేళ్లు గడిచాక.. ఎన్నికలకు ముందు టీడీపీ తెలంగాణకు జై కొట్టినా.. టీఆర్‌ఎస్‌తో కలిసి కూటమి కట్టినా.. కాంగ్రెస్‌ను అధికారం నుంచి పడదోయాలన్న తాపవూతయమే! మొత్తంగా తెలంగాణ అంశం వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయ అవసరంగా మిగిలిపోయిందన్న బాధ తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకుంటున్నది. ఫలితంగానే ఆశలు పెరిగి.. అంతలోనే నిరాశ కలిగి.. చివరకు అసంతృప్తితో రగిలిన యువత.. తమను తాము దహించుకుంటున్నారు! అందమైన భవితవ్యాన్ని రాజకీయ నాయకుల ప్రకటనలకు.. ప్రేలాపనలకు.. ప్రమాణాలకు తగులబెట్టుకుంటున్నారు!



సకల తెలంగాణ శక్తులను.. సమస్త తెలంగాణ ప్రజలను ఐక్యం చేసే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్న టీజేఏసీపైనా విమర్శలు లేకపోలేదు. అన్ని శక్తులను కలుపుకొనిపోయి.. అంతిమంగా ఉద్యమశక్తిని పెంచాల్సిన జేఏసీ.. ఈ క్రమంలో కొన్ని చరివూతాత్మక పిలుపులు ఇచ్చినా.. కొన్ని రాజకీయ పార్టీలకు మొగ్గు చూపుతున్నదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాల చక్రబంధం నుంచి టీ జేఏసీ బయటపడలేకపోతున్నదన్న ఆవేదన పలువురు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. నిజానికి జేఏసీ పిలుపులకు వచ్చిన స్పందన మరే రాజకీయ పార్టీ కార్యక్షికమానికీ రాలేదు! మిలియన్ మార్చ్.. సాగరహారం.. చరివూతలో నిలిచిపోయిన సకల జనుల సమ్మె.. దేనికదే విశిష్ఠమైన ఉద్యమంగా భాసిల్లింది. ఏ పార్టీకీ టీజేఏసీ అంటకాగాల్సిన పని లేదని కుండబద్దలు కొట్టింది. కోదండరాం నాయకత్వాన్ని అంగీకరించిన తెలంగాణ పల్లెలు.. ఆయన పిలుపు అందుకునేందుకు ఇప్పుడంటే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు! కానీ.. ఇంకా జేఏసీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణపై వైఖరి స్పష్టం చేయని చంద్రబాబును ధిక్కరించి.. టీడీపీ నుంచి బయటికి వచ్చిన నాగం జనార్దన్‌డ్డిని ఇంకా జేఏసీలోకి ఎందుకు ఆహ్వానించలేదన్నది పెద్ద ప్రశ్న! దీనికి ఎవరు అడ్డుపడుతున్నారన్నది అంతుచిక్కని సందేహం! జేఏసీ పరాధీనంలో ఉన్నదా? అనే అనుమానం!



సంఘాలదీ అదే తీరు! తెలంగాణ ఉద్యమంతో ఓ పదవి.. ఓ పలుకుబడి! 30 రోజుల్లో అసెంబ్లీకి వెళ్లడం ఎలా? ఇదా విద్యార్థుల అధ్యయనం? రాజకీయ పార్టీల తీరును విమర్శించేందుకు సిద్ధమయ్యే అనేక తెలంగాణ ప్రజా సంఘాలు టీజేఏసీ గొడుగు కిందికి ఎందుకు రావడం లేదు? తిమిరంతో సమరం అంటూ తాము ఒక ప్రమిద పాత్ర పోషిస్తున్న ప్రజాసంఘాలు.. తెలంగాణ సంఘాలు ప్రమిదలన్నీ ఒక చోట చేరి వెలుగులు చిమ్మితే అంధకారం పలాయనం చిత్తగిస్తుందన్న వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఇవన్నీ విమర్శలు కావు.. దిద్దుకోవాల్సిన పొరపాట్లు! తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమరంలో అక్షరాయుధాలు అందిస్తున్న బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్న నమస్తే తెలంగాణ.. ఈ పొరపాట్లను సకల ఉద్యమశక్తుల దృష్టి తేవాలని భావించింది. తెలంగాణ జనం కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమ శక్తులను ఏకం చేయాలని సంకల్పిస్తున్నది. ఉద్యమం పట్ల మాకు అత్యంత సున్నిత భావం ఉంది.



వేయి బలిదానాల పవివూతత మా మనసులో కదలాడుతున్నది. రెట్టింపు సంఖ్యలో యువత ఒంటిపై కమిలిన లాఠీ దెబ్బల గాయాలు మా కలాలను సలుపుతున్నాయి! ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదంవూడులు తమ కాలుతున్న కడుపులకు భావి తెలంగాణలో గుప్పెడు మెతుకులు దొరుకుతాయన్న ఆశతో బతుకుతున్న వాస్తవ దృశ్యాలు మమ్మల్ని ఈ సాహసానికి పురికొల్పుతున్నాయి. ఆశ ఒక్కటే.. అన్ని శక్తులు కలవాలని! ఆకాంక్ష పాతదే.. ప్రత్యేక రాష్ట్రం సాకారమవ్వాలని! నాలుగు కోట్ల ప్రజల తరఫున ‘తెలంగాణ సాధన కర్తలకు’ నమస్తే తెలంగాణ చేస్తున్న వినవూమపూర్వక విజ్ఞప్తి.. కలిసి కొట్లాడుదామనే!