Monday, December 21, 2009

సమైక్యం GO 1845 Dt. 11/12/2009 ?

(http://telanganaporadu.wordpress.com/welcome/latest-posts/)
డిసెంబర్‌ పదకొండున రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ జీవో నెంబర్‌ 1845 విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల గురించి నాబార్‌‌డ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 130 కోట్ల 26 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 109 రోడ్లు, తొమ్మిది వంతెన నిర్మాణానికి కేటాయింపులు జరిపింది. ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. సర్కారు జరిపిన కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు పది కోట్లు… మిగతా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు 120 కోట్లు కేటాయించింది. తెలంగాణలోని ఆరు జిల్లాలు ప్రభుత్వానికి మ్యాపులో ఆ సమయంలో కనిపించనే లేదు..
జీవోలోని వివరాలు పరికిస్తే ఏమీ చెప్పకుండానే మనకు అర్థం అవుతుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి పనుల కోసం నాబార్‌‌డ మంజూరు చేసిన నిధులు 130 కోట్ల 46 లక్షల 14వేల రూపాయలు మంజూరు చేసింది.
జిల్లాల వారిగా చూస్తే,
కోస్తాంధ్రలో ….
తూర్పు గోదావరి జిల్లా = 12.92 కోట్లు
పశ్చిమగోదావరి జిల్లా = 12.14 కోట్లు
గుంటూరు = 8.80 కోట్లు
కృష్ణా = 6.57 కోట్లు
నెల్లూరు =5.23 కోట్లు
ప్రకాశం = 16.19 కోట్లు
మొత్తం = 61.85 కోట్లు
ఉత్తరాంధ్రలో …
శ్రీకాకుళం = 16.66 కోట్లు
విశాఖపట్నం = 2.88కోట్లు
విజయనగరం =22.27కోట్లు

మొత్తం = 41.87

రాయలసీమలో…
అనంతపురం = 1.85 కోట్లు
చిత్తూరు = 7.40 కోట్లు
కర్నూలు = 5.32 కోట్లు
కడప = 1.00కోట్లు

మొత్తం = 15.57కోట్లు

తెలంగాణలో…
మెదక్‌ =5.40 కోట్లు
మహబూబ్‌నగర్‌ = 1.05కోట్లు
నల్గొండ = 1.22కోట్లు
ఆదిలాబాద్‌ = 1.64కోట్లు
మొత్తం = 9.31 కోట్లు
తెలంగాణ లోని మిగతా ఆరు జిల్లాలు.. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ఒక్క రూక కూడా విదిల్చలేదు.. హైదరాబాద్‌ రాజధాని కాబట్టి దాన్ని మినహాయించారనుకుందాం.. మరి మిగతా అయిదు జిల్లాల మాటేమిటి? కేటాయించిన నాలుగు జిల్లాలకైనా ఏ దామాషా ప్రకారం, ఏ ప్రాధాన్యం ప్రకారం కేటాయింపులు జరిపారు?

నాబార్‌‌డ మూడు రకాల పనుల కోసం నిధులు ఇచ్చింది. ఈ నిధులను అన్ని జిల్లాల్లో పనుల ప్రాధాన్యం ఆధారంగా కేటాయించాల్సిన సర్కారు దానికి తిలోదకాలు ఇచ్చింది…ఒక జిల్లాకు అధికంగా కేటాయింపులు జరిపిందంటే అక్కడ పనుల అవసరం అధికంగా ఉన్నట్లు భావించాలి.. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేసే పని అదే… ప్రధానంగా గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రజల అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో పల్లెల్లో అభివృద్ధి అంతంత మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరి అలాంటప్పుడు నాబార్‌‌డ నిధులను పంపిస్తే.. వాటిని ఏ విధంగా కేటాయించాలి? ఆయా జిల్లాల అవసరాల్ని బట్టి దామాషా ప్రకారం అన్నింటికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత లేదంటారా? తెలంగాణపై చిన్నచూపు చూస్తే చూసిరి.. కనీసం రెండు నెలల క్రితం వరదలతో అల్లల్లాడిపోయిన జిల్లాలు కర్నూలు, మహబూబ్‌నగర్‌లనైనా ప్రాధాన్య క్రమంలో ముందుంచాల్సిన బాధ్యత సర్కారుకు లేదా? ఈ జిల్లాలను వరదలు ముంచెత్తి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కానీ, ఆ జిల్లాలో రహదారులు బాగు చేయటం అత్యంత ప్రాధాన్యమైంది. కానీ, కర్నూలుకు కేటాయించింది అయిదు కోట్లు… మహబూబ్‌నగర్‌కు ముష్టి కోటి రూపాయలు.. అదే గోదావరి జిల్లాలు ఒక్కో జిల్లాకు పన్నెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు.. ఇక మంత్రి గారి జిల్లా విజయనగరానికి ఏకంగా 22 కోట్లు కేటాయించుకున్నారు.. సరే ఏ మంత్రయినా తన నియోజక వర్గానికి తన జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం ఇటీవలి కాలంలో సహజం… సాక్షాత్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా చేసింది ఇదే.. మరి మిగతా జిల్లాల విషయంలో ఈ వివక్ష దేనికి ప్రాధాన్య క్రమంలో మినహాయింపులు ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ, ఆ మినహాయింపు, ఆ కేటాయింపుల లేమి తెలంగాణ జిల్లాలకు మాత్రమేనా? అవేం పాపం చేసుకున్నాయి…సమైక్యవాదులకు హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాలు కళ్లకు కనిపించనట్లే… సర్కారుకు కూడా కనిపించలేదా? రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఉంటే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న మొత్తం పదమూడు జిల్లాలకు ఎన్నో కొన్ని నిధుల కేటాయింపులు జరిగాయి. ఏ జిల్లానూ ఇక్కడ మినహాయించలేదు. ప్రతి జిల్లాకు కొద్దోగొప్పో నిధులను కేటాయించారు..మరి తెలంగాణలోని ఆరు జిల్లాలు ఏం పాపం చేశాయి? ఈ ఆరు తెలంగాణ జిల్లాలకు నిధులు కేటాయించకూడదని అనుకున్నారా? లేక ఈ ఆరు తెలంగాణ జిల్లాల్లో రహదారులు వంతెనలు కళకళలాడుతున్నాయా? అన్ని జిల్లాలూ సరైన రవాణా మార్గాలు కలిగి అత్యున్నతమైన అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చిందా? అభివృద్ధి ఫలాలు అందరికీ సమాన స్థాయిలో అందాలన్నదే సమైక్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యమంటే అర్థం ఇదేనా?
మరో విశేషం ఈ జీవోలో ఉంది. కడప, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు 5కోట్ల రూపాయలకు పైగానే నిధులు కేటాయించారు.. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఆ నాలుగు జిల్లాలకు విదిలించింది కూడా అక్షరాలా తొమ్మిది కోట్ల 31 లక్షల 72వేల రూపాయలతో సరిపుచ్చారు.. నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు కేటాయించిన మొత్తం ఒక్క గుంటూరుకు కేటాయించిన మొత్తంతో దాదాపు సమానం..

No comments:

Post a Comment