Sunday, October 16, 2011

తప్పు ప్రజాస్వామ్యానిదే-తప్పు గాంధీ దే

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా?
శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కోరుకుంటే ప్రభుత్వం తయారుగా ఉంది. మీరు శాంతి కావాలనుకుంటే నా ఆదేశాలు పాటించండి. మరో దారే లేదు. దుకాణాలు తెరవండి. లేదా కాల్చేస్తాను. ఫ్రాన్స్ అయినా అమృత్‌సర్ అయినా సైనికుడిట్లాగే ఉంటాడు. సైనిక భాష ఇట్లాగే ఉంటుంది. కానీ డయ్యర్ చరిత్ర కళంకమయ్యాడు. వేట కుక్కలా మొరిగిన వాడు ఊరకుక్కలా చచ్చిపోయాడు. అచ్చంగా కుక్క చావు. ఎనిమిదేళ్లకే . జలియన్‌వాలాబాగ్‌లో వందలమందిని పొట్టన బెట్టుకున్న ఎనిమిదేళ్లకే పక్షవాతంతో, మాటపడిపొయ్యి, బ్రెయిన్ హెమరేజ్‌తో, నరాలు చిట్లి డయ్యర్ కుక్కచావు చచ్చాడు.

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా? శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కోరుకుంటే ప్రభుత్వం తయారుగా ఉంది. మీరు శాంతి కావాలనుకుంటే నా ఆదేశాలు పాటించండి. మరో దారే లేదు. దుకాణాలు తెరవండి. లేదా కాల్చేస్తాను. ఫ్రాన్స్ అయినా అమృత్‌సర్ అయినా సైనికుడిట్లాగే ఉంటాడు. సైనిక భాష ఇట్లాగే ఉంటుంది. కానీ డయ్యర్ చరిత్ర కళంకమయ్యాడు. వేట కుక్కలా మొరిగిన వాడు ఊరకుక్కలా చచ్చిపోయాడు. అచ్చంగా కుక్క చావు. ఎనిమిదేళ్లకే . జలియన్‌వాలాబాగ్‌లో వందలమందిని పొట్టన బెట్టుకున్న ఎనిమిదేళ్లకే పక్షవాతంతో, మాటపడిపొయ్యి, బ్రెయిన్ హెమరేజ్‌తో , నరాలు చిట్లి డయ్యర్ కుక్కచావు చచ్చాడు. రవి గ్రుంకని సామ్రాజ్యమూ కుక్కలాగా తోక ముడిచింది. కానీ చరిత్ర మేల్కొంది. ప్రతి సందర్భం పొడవునా అది తేజోమయమయింది. డయ్యర్‌లు, హిట్లర్‌లు, ప్రజాసమూహాల అంతర్వేదనా భాషను అర్థం చేసుకోని వాళ్లు పెంటకుప్పల మీద స్థిరనివాసం ఏర్పరుచుకుంటారు. చివరికి గడ్డి పువ్వూ మొలవని విధంగా.కడుపునిండా నీళ్లున్న వాడిదీ అదే భాష. కోట్లమంది సమూహం పరివేదన వారికి అర్థం కాదు. కాల్చేయమన్న ప్రతివాడూ డయ్యర్ కాకపోవచ్చు. కానీ సైన్యాన్ని దింపమన్నవాడు, కనిపిస్తే కాల్చేయమన్నవాడు. కాల్చేసి చూపిస్తానన్నవాడు ఒకడే. సైనిక దుస్తులు లేని విద్వేషం. న్యాయంఒక వేపు ఉంటుంది. అసహనం ఒక వేపు మోహరించి ఉంటుంది. బిరడా తీస్తే బద్దలయ్యే లావా ప్రవాహం భంగపాటు ఒకవేపు నిలుచుని ఉంటుంది. కడుపు నిండినవాడు . కాలువల నిండా నీళ్లు నిండినవాడు. వాడి కాపలా కుక్కా ఒకే భాష మాట్లాడుతారు. ప్రజా సమూహాలకు విద్వేషం ఉండదు. భంగపాటు ఉంటుంది. చెప్పింది ఆచరించని వాళ్ల పైన అసహనం ఉంటుంది. అది ఇనుపకొలిమిలోంచి తీసిన ఇనుము తెట్టులాగా పేరుకుపోతూ ఉంటుంది దృఢంగా. రైల్ రోకో చేస్తే యావజ్జీవం ప్రకటిస్తుంది పోలీసు డ్రెస్సు. వలస పాలనలో ఒకటే భాష. అణచివేత అదొక నేరం అయినట్టు ..అది బ్రిటన్ కావొచ్చు. పొరుగువాడు కావొచ్చు. వలసాధిపత్యపు భాష. నిరంకుశ పదాలు . ప్రజాస్వామ్యాన్ని హననం చేసే ఎత్తులవి.. తాయెత్తులవి. మనసు విరిగినవాడు సమ్మె కడితే ఎట్లా కట్టాలోచెబుతుంది. చెదిరిపోయినవాడు ఏఏ సమ్మె చేయాలో భాషణాలు చెబుతుంది. బడి బంద్ పెట్టకూడదు. పిల్లల చదువులు పోతాయి. ఉపాధ్యాయులుసమ్మె చేయరాదు. ఉద్యోగులు సమ్మె చేయరాదు. సింగరేణి కార్మికులు అసలే సమ్మె చేయరాదు. కరెంటు పోతుంది. కారు చీకటి కమ్ముకుంటుంది. పొలాలు ఎండిపోతాయి. ఎట్లా? ఏం చెయ్యాలో చెప్పేవాడిదే ఆధిపత్యం. వాడు చెప్పినట్టు చెయ్యి. సమ్మె కూడా ఒకరి కనుసన్నల్లో నడవాలి. ఒకరు చెప్పిన పరిధుల్లోనే నడవాలి. అప్పుడే అది శంఖంలో పోసిన పవిత్ర సమ్మె. అది డయ్యర్ భాష. డయ్యర్‌ది అసహనం.

ముందు దుకాణాలు ఎందుకు బంద్ పెట్టారో ఆ కారణం గురించి డయ్యర్‌కు అవసరం కూడా లేదు. ప్రభుత్వానికీ అవసరం లేదు.అలనాడు 1919లో బైశాఖి ఉత్సవాల్లో గుమికూడారు వాళ్లు. ఒక సాంస్కృతిక ఉత్సవంలో అప్పుడు డయ్యర్ తుపాకీ మొరిగింది. గాంధీ మహాత్ముడే అయ్యాడు. శాంతిగా జరిగింది స్వాతంత్య పోరాటం. శాంతి కోసం కూడా. శాంతి కోసం యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాన్ని సహించదు సైనికతత్వం. ప్రజాస్వామ్యం ముసుగుది. చెప్తుంది. చెయ్యదు. వాగ్దానం ఇస్తుంది. నిలుపుకోదు. మాటమీద నిలబడదు. ప్రజాస్వామ్యాన్ని జనసమూహం ఆచరిస్తుంటుంది. తనన్నమాటలను తనే మింగేసిన ప్రజాస్వామ్యంపై శాంతికోసం యుద్ధం జరుగుతూ ఉంటుంది. రాజ్యానికి అసహనం. రాజ్యానికి తుపాకీ ఉంటుంది. అచ్చం డయ్యర్‌లా మొరుగుతుంటుందది. సారాంశం ఇంతే. డిసెంబర్ 9 ఒక పచ్చి అబద్ధపు తేదీ అంటారు ఏలికలు. కాదు. దాన్ని జీవింపచేస్తాం అంటారు తెలంగాణ జనసమూహం. డిసెంబర్ 9 కొట్లాడి సాధించుకున్నం. ఉప్పిడి ఉపాసముండి గెలుచుకున్నం. ఉప్పెనై లేచి నిలబడి కలెబడి గెలుచుకున్నం. అది కాగితాలమీద పరుచుకున్న ఉత్త బోలు ప్రకటన కాదు. అందుకే అసహనానికి లోనవుతున్నది తెలంగాణ. అందుకే కుడుపులో సుమ్మర్లుచుట్టుకునే అలల సముద్రం లాంటి పోటెత్తే కన్నీళ్లనూ దాచుకున్నది తెలంగాణ. కన్నీటి కాసారం .అది ఉప్పెనవలె సకల జనుల సమ్మె కట్టింది. ఇప్పటిదాకా తనను తాను హింసించుకున్నది. సైనిక భాషకు, సైనికుడికి అర్థంగానిదేదో ఒకటి ఉండనే ఉంది. డిసెంబర్ 9 తర్వాత మంటల్లో మాడినవాడు. స్వచ్ఛందంగా రైలుకు ఎదురేగినవాడు. ఉరిపోసుకుని ఊపిరితీసుకున్నవాడు. రెండేళ్లుగా సాగుతున్నదిది. భంగపడ్డవాడిది కాదు విద్వేష భాష. ఏలికది. ముందు ఏం జరిగిందో? అక్కరలేని భాష. జీవితాంతం చీకటి కొట్లు ఉండవు. పరాధీనమైనవాడు, బానిసయినవాడు ఎప్పుడో ఒకప్పుడు స్పార్టకస్‌లా మల్లయుద్ధంలో శత్రు పసికట్టి ఉత్తచేతులతో మట్టికాళ్ల మహారాక్షసిని ఎదిరిస్తాడు. స్పార్టకస్ గోడు పట్టదు. తుపాకీ భాష మాట్లాడిన వాడే ఇప్పటి ప్రజాస్వామ్య పరిహాసకుడు. ఒక్కొక్కప్పుడు భ్రాంతీ వ్యాపిస్తుంది.

పన్నెండువేల కోట్ల రూపాయల కంపెనీ ఓనరు , సాధు జపం చేస్తాడు. ఎవరి దొర ఎవరో? నిర్ణయిస్తాడు. ఆచరించు. థాట్ పోలీసింగ్. గడీల కిప్పుడు పైడికంటె కాపలా. పెట్టుబడి క్రూరమైంది. భూస్వామ్యానికున్న పిసరంత నెనరు పెట్టుబడికి ఉండదు. అది నెత్తుటి పునాదులు తవ్వి మానవ రక్తమాంసాల,ఎముకల పోగుల మహాసౌధాల్ని కట్టింది. కాపోతే ప్రజాస్వామ్యంగా కనపడటానికి అది గడీలాగా మాట్లాడదు. భూస్వామ్యంలాగా మాట్లాడదు. నిజాం లాగా మాట్లాడదు. అచ్చం ఒక పెట్టుబడి దారుడి భాష నిన్ను సంస్కరించే ఏసుక్షికీస్తులా ఉంటుంది. పాలిష్డ్‌గా.అతనొక రక్షకుడు. నీ ముడ్డిబట్ట గురించి కూడా నీకు చెప్ప గలిగిన మర్యాద మప్పితపు భాష. నీ దొర గురించి వాడే మాట్లాడతాడు.అతనొక ప్రయోక్త.చితికిపోయిన భూస్వామ్యపు చితుకుల మంటను ఎగదోసి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ఎదురుగా నిలబెట్ట గలిగిన వాడే ఇవ్వాల్టి ప్రజాస్వామ్యవాది. ఆకాంక్షల కలలు ఫలిస్తున్నప్పుడు, కలలు సాకారమవుతున్నప్పుడు బీరువాల్లో మూలుగుతూ ముతక వాసనేసే డబ్బు సంచులు గుప్పించి టోకున ప్రజాస్వామ్యాన్ని కొనేవాడే నేటి పెట్టుబడిదారుడు. అప్పనంగా అప్పజెప్పిన సర్ఫెఖాస్‌లు, వక్ఫ్ భూములు, కంపెనీల మూలధనమై నిలిచిన రాజ్యం. అన్నీ వెరసి... పెట్టుబడినీతులు బోధిస్తుంది. కనుక అది భవిష్యత్‌ను ఆక్రమించుకునే కిరాతక హిట్లర్. నీతిని బోధిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఆచరించమంటుంది. ప్రజాస్వామ్యయుతంగా నిఖార్సయిన అహింసవాదంతో, శాంతిగాజరుగుతున్న ఉద్యమంమీదకు అది తుపాకీ తీస్తుంది. అప్పుడు మనం దిగ్భ్రాంతి చెందనక్కరలేదు. కానీ కొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఈ యుగపు దొరపూవరో తెలుసుకునే సరికే నీతుల్లో పునీతమైపోతాడు పెట్టుబడిదారుడు.

అసలు శత్రువు కనబడడు. తెలంగాణ హంతకుల భాష ఇప్పటి పెట్టుబడిదారు భాష ఒక్కటే. హింస ... ఏది హింస ఎనిమిది వందల మంది ప్రాణాలు తీసిన భంగపాటు. మృత్యువు కమురు వాసనేస్తుంది. కనపడని హింస. ఆకాంక్షలు రేపినవాడు. ఓటుకోసం ఆశల దీపం వెలిగించిన వాడు. కోటను ముట్టడిస్తామన్నప్పుడు మోకరిల్లి ఆకాంక్ష ప్రకటించిన వాడు. కలను చిదిమి దీపం మలిపిన వాడు ఒకడేఅయినప్పటి ఆశాభంగం... ఎనిమిదివందల మందిని బలిగొన్న హింస. పెట్టుబడి కిరాతక ప్రకటనల కింద మూలుగుతున్న మిత్తి స్వరూపం. ప్రజాస్వామ్యం ఒక పరిహసించిన మైమరపు. ఎంతకూ తేలదు. ఎంతకూ కదలరు. ఏదీ మాట్లాడరు. ముప్పయి ఐదు రోజులు. ఎగదన్నుక వస్తుంది నాభిలోంచి దుఃఖం మాట్లాడ్తున్నప్పుడు అకారణంగా నిస్సహాయతలోంచి పొంగివచ్చే దుఃఖం. ఎసరు ఎక్కొచ్చినట్టు. పండుగ ల్లేవు. మా పిల్లలకు కొత్తబట్టలు లేవు. ఏడ్వు స్వామిగౌడ్, కానీ లొంగిపోకు. కరువుదీరా ఏడువు కానీ శాంతి కోసం పాతిన స్తంభంలా నిలబడు. కొన్ని అక్షరాలిస్తాను నీ కోసం. కొన్ని కన్నీళ్లూ ఇస్తాను. ఒక సింగరేణి కార్మికుని సెమ్మాసిస్తాను. జాడూ కొట్టే సఫాయి కార్మికుని చీపురుకట్ట ఇస్తాను. క్షురకుని కత్తెర ఇవ్వగలను. ఏమివ్వగలను. కోట్ల గొంతుల నినాదం ఇవ్వగలను. నిజమే మంత్రులు మోసమే చేస్తారు. నిజమే ఎమ్మెల్యేలూ మోసం చేస్తారు. అద్దాల బంగ్లాల్లో, కాంట్రాక్టుల్లో, ఒప్పందాల్లో, ఖజానాల్లో మూలుగుతున్న ముక్క వాసనేసే సిరి సంపదల్లో కూరుకుపోయారు వాళ్లు. ఒక రాజ్యమూ, దాని తుపాకీ, వారి తుపాకీని భుజాన మోసి, కుక్కలా, అచ్చంగా వేటకుక్కలా మొరిగే డయ్యర్‌లకు పుట్టుబానిసలు వాళ్లు. కానీ నిలబడ్డాం కదా మనమే.


మన తెలంగాణ మనకు కావాలని, పూర్తి ఐచ్ఛికంగా, పూర్తి స్వేచ్ఛ కోసం, పూర్తి స్వాతంత్య్రం కోసం, స్వచ్ఛందంగా నిలబడ్డాం. శాంతి కోసం యుద్ధంలో అశాంతి వల్లనూ, ప్రజాస్వామ్యం హంతకుల అవహేళనల వల్లనూ మరణించిన ఎనిమిది వందల మంది బలిదానాల పునాదుల మీదుగా వచ్చాం. అవును స్వామిగౌడ్ మీతో మేమూ ఉన్నాం. నిజమే కరుణగల, దయగల ప్రజాస్వామ్యంలో తెలంగాణ ఒక ఒంటరి సమాజం. గోడు చెప్పుకుంటే వినడానికి ఒక మనిషి, గోస పంచుకోవడానికి ఒక మనిషి, పోయి రావడానికి ఒక ఊరూ ఉండాలి. తెలంగాణకు ఇప్పుడు ఒక ఊరు లేదు. గోస చెప్పుకుంటే విని పరిష్కరించే మనిషీ లేడు.పోయి రావడానికి ఒక ప్రాంతమూ లేదు. ఒంటరిదై పోయింది తెలంగాణ .వినాల్సిన వారు వినరు. వారు బానిసలు. కనాల్సిన వారు కనరు. మూడుకోతులు వినవు. మాట్లాడవు. చూడవు. గాంధీ సమాధి వద్ద మౌనమే శరణ్యం. ఒక చెంపన కొడితే మరో చెంప చూపినప్పుడు మరో చెంపనూ కొట్టే ప్రజాస్వామ్య హంతకుల రాజ్యం. నిజమే . కానీ సకల జనులాలా! డయ్యర్ కుక్క చావే చస్తాడు. అతను చరిత్ర పెంటకుప్పల మీదే స్థిరనివాసి. చరిత్ర మాత్రం త్యాగాల పునాదుల మీద నిర్మితమౌతుంది. వర్తమానంలో మరింత వెలుగులాగా... పోరాటాల పునాదుల మీద చరిత్ర మారాకు తొడుగుతుంది. పరిపుష్టితోనూ, మరింత బలంగానూ.. తెలంగాణ మాత్రం మరణించదు. ఉద్యమమూ ఆగదు. అది నిజంగానే ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్నే నమ్ముకున్నది.

చరిత్ర ముందున్నది కాలం ‘ ఇవన్నీ కాదు. చెప్పులు, బూట్లతో మొత్తం రాజకీయ నాయకులను కొట్టీ కోట్టీ చంపితేనే తెలంగాణ వస్తుంది’ - ఇది ఒక మహిళా ఉపాధ్యాయురాలి బహిరంగవూపకటన. బండారు దత్తావూతేయ సాక్షిగా... బహుశా శాంతికోసం జరిగే యుద్ధం ఇట్లాంటి మలుపు తీసుకుంటే తప్పు ప్రజాస్వామ్యానిదే. దాన్ని నమ్మిన వాళ్లది కాదు. తప్పు గాంధీ దే. ఆయనను నమ్ముకున్న శాంతియుత ఉద్యమానిది కాదు.
- అల్లం నారాయణ

No comments:

Post a Comment