Wednesday, September 26, 2012

తెలంగాణ నిలువెత్తు సంతకం-కొండా లక్ష్మణ్ బాపూజీ

http://www.namasthetelangaana.com/Editpage/columnists/Allam-Narayana.asp?ContentId=155073
 
కోతపెట్టే శీతాకాలపు ఢిల్లీ చలి ఇంకా వణికిస్తూ ఉండగానే... జంతర్‌మంతర్‌లోని ఆ ముసలివాళ్ల శిబిరం బిలబిలా
నిండిపోయింది. బాపూ జీ కరస్పర్శ శీతలంగానే ఉన్నది. జీవం లేనట్టుగా ప్రారంభమైన ఆ శిబిరం కాసేపటికి మాటల మంటలతో వెలిగింది. తొంభై ఆరేళ్ల వయసులో కొండా లక్ష్మణ్ బాపూజీ జంతర్‌మంతర్‌లో వారంపైబడి చేసిన దీక్షల గురించి ఇది. ఆయనకు సంఘీభావంగా వెళ్లినప్పుడు ఈ కురువృద్ధునికి ఏదో శక్తి ఉంది అనిపించింది. గాంధేయవాదులంటే కొంత ఎడంగా అనిపించే తత్వంలోంచి, కాంగ్రెస్‌కు కొంచెం దగ్గరగా ఉండి, దీక్షలు, సత్యాక్షిగహాలు, సుతిమెత్తని ఆగ్రహాలతో తెలంగాణ సాధిస్తామని నమ్మే వాళ్లంటే కొంత అపనమ్మకంగా ఉన్నా బాపూజీతో మాత్రం అందరం కలిసి నడుస్తున్నట్టుగా అనిపించేది. మలి తెలంగాణ ఉద్యమం లో ఇద్దరు కురువృద్ధులు అట్లా ఆకర్షించారు. కాళోజీ మీద ప్రేమ వేరు. ఆయన ఇతరేతర మనసు కలిసిన గురువు. కానీ వరంగల్ భూపతి కృష్ణమూర్తి, హైదరాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీలు మలి తెలంగాణ ఉద్యమంలో ఒక అంతస్సూవూతంగా చేతులు కలిసిన, ఉద్దీపనలుగా అనిపించిన వాళ్లు. ఇప్పుడా కొండా లక్ష్మణ్ బాపూజీ లేరు. అంతస్సూవూతమేదో తెగిపోయినట్టుగా కోల్పోయినట్టుగా, లోటుగా ఉన్నది.ఆయన వృద్ధుడే. కానీ విద్యార్థి, యువజనులను నమ్మాడు. రాజకీయాలు భ్రష్టుపట్టడం ఎరుకతో ఆయన యువజనం మీద విశ్వాసం పెంచుకున్నాడు. బహుశా ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ అనుభవం. రాజకీయాల్లో, రాజకీయేతరంగా తెలంగాణ ఆకాంక్షకు సంబంధించి జరిగిన అన్ని పరిణామాల మీద అవగాహన ఆయన నిండు అనుభవాల సారంగా ఏర్పడిందే. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన లోపలి మనిషి. అసహజ అభివృద్ధి, వలస ఆధిప త్యం తెలంగాణను ధ్వంసం చేసిన తీరును ఆయన జీవిత కాలమంతా అనుభవించి పలవరించినందు వల్లనే ఒక పట్టుదల, మొండితనం, అన్ని మార్గాల పట్ల సహిష్ణుత, భిన్న భావజాలాలు, కార్యాచరణలపట్ల ఓర్పు సమకూరి ఉంటాయి. ఆ రకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ నిలు సంతకం. తెలంగాణ చారివూతిక కారణాలు, ఇక్కడ జరిగిన పోరాటాలు, వాటిలో ప్రత్యక్ష భాగస్వామ్యం, పరిశీలన వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ రూపుదిద్దుకున్నాడు.నైజాం వ్యతిరేక పోరాటం, గాంధేయవాదం, నిరంకుశ నైజాంమీద సాయుధ చర్యలు, స్వాతంవూత్యానంతరం కూడా ఏ కలా నెరవేరని తనం, తెలంగాణ ప్రత్యక్షంగా పరాధీన కావడం, ఆయనను 1969లో మంత్రిగా రాజీనామాకు పురికొల్పిన అంశమైతే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రతిపక్షంగానే ఉండడం, మరే పదవి స్వీకరించకపోవడం ఆయన నిబద్ధ రాజకీయాలకు, నైతికత, మమేకత విలువలకు నిదర్శనం.

వాంకిడి లాంటి చిన్న ప్రాంతం నుంచి వచ్చి తొంభదారు సంవత్సరాలూ ఒకే చైతన్య క్రమంలో విలువలు కాపాడుకుంటూ ఒక మనిషి బ్రతకడం ఎట్లా సాధ్యమయింది. ఆ మనిషిలో ఆ విలువలు ఎట్లా రూపుదిద్దుకున్నాయి. తపాలా గుమా స్తా కావలసిన మనిషి న్యాయవాదియై, సైకిల్ మీద భువనగిరి వెళ్లి కేసులు వాదిం చి, గాంధీ ప్రభావానికి లోనైనా ఆయన ఉక్కు క్రమశిక్షణకు మూలం బహుశా హరిబౌలీలో ఆ కాలంలో ఉండిన రాజకీయ వాతావరణం, రహస్యంగా వ్యాపించిన నైజాం వ్యతిరేకత. ఆర్యసమాజ్ ప్రభావం. గణేష్ వ్యాయామశాల యవ్వన కసరత్తులు, యోగా ఆయనను కన్నుమూసేదాకా నిలబెట్టిన దారుఢ్యాలయి ఉంటాయి. కోఠి రెసిడెన్సీలో జెండా ఎగరేయించి ఉంటాయి. ఆంధ్రవూపదేశ్ విలీ నం చేదు అనుభవాలు, తెలంగాణ మొత్తంగా అప్పటి ప్రజాభివూపాయం, ఆయన చేత తెలంగాణపైన రాజకీయ డాక్యుమెంట్‌ను విడుదల చేయించింది. అది నైజాం వ్యతిరేక పోరాటంలో రూపొందిన చైతన్యానికి కొనసాగింపుగా 1969లో బాపూజీ రాజీనామా చేశారు. అదే కొనసాగింపుగా 1996లో పునఃవూపారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఆయన నిటారుగా నిలబడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితకాలమంతా మూడు పోరాటాల గుండా మూడు దశల గుండా గడిచింది. నిజానికి స్వాతంవూత్యానంతర కాలంలో నెహ్రూ ప్రవచించిన ప్రకారంగానే, ఇప్పటికీ మన్‌మోహన్ ప్రవచిస్తున్నట్టుగానే పేదలు పేదలుగా మిగిలిపోవడం, స్వేచ్ఛా స్వాతంవూత్యాల మాట అట్లా ఉంచి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగస్థలాలు కొందరికే చెందినవి కావడం కొండా లక్ష్మణ్ బాపూజీని కలచివేసింది. అందుకే ఆయన బలహీనవర్గాల ఉద్యమ నాయకుడు అయ్యారు. సాంప్రదాయ వ్యవసాయిక భారతదేశంలో వ్యవసాయం, చేతి వృత్తు ల జీవన గతులు ఛిద్రమైపోతున్న సమయాల్లో, ఆయన బలహీన వర్గాల పక్షాన పతాకం ఎత్తారు. ఆ తర్వాత తెలంగాణ పతాకమెత్తారు. దోపిడీ, పీడన, ఆధిప త్యం, వివక్షలు ప్రాంతీయ, సామాజిక అంతరాలు అనుభవించిన వాడు కనుకనే ఆయన జీవితం ఈ మూడు అంశాలను అల్లుకుని సాగింది. ఆ తత్వమే అన్నింటినీ ఒక అల్లికలో కూర్చింది.

ఒకానొక పొద్దున్నే ప్రఖ్యాత కవి ఎన్ గోపి ఫోన్. మన్‌మోహన్‌సింగ్ చిల్లర దుకాణాలను కుప్పకూల్చే ఎఫ్‌డీఐల ప్రకటన చేసి విదేశీ వాల్ మార్ట్‌లకు తలుపులు బార్లా తెరిచిన నాడు ‘నమస్తే తెలంగాణ’ పెట్టిన హెడ్‌లైన్ ‘చిల్లర దొంగలు’ చూసి ఉదయాన్నే పనిగట్టుకుని ఫోన్ చేశారాయన. మీ హెడింగ్ నాకు దుఃఖాన్ని తెప్పించింది అన్నారాయన. మా నాయన నెత్తిమీద బట్టల మూట పెట్టుకొని అమ్మేటోడు. సహకార సంఘాలతో అది కూలిపోయింది. అప్పుడు మా నాయన అన్నడని యాది తెచ్చుకున్నారు గోపి. ఇగ సహకారం నెత్తిమీద మామూటలను కూల్చివేసి బతుకు బర్‌బాద్ చేసింది’ అని.. అది ఆ తర్వాత కాలంలో మరింత ఎదిగింది. చిల్లర కిరణా దుకాణాలను సూపర్ బజార్‌లు మింగినట్టే. సూపర్ బజార్‌లను మాల్‌లు, బిగ్ బజార్‌లు మింగినట్టే, వీటిని రేపు ఎఫ్‌డీఐలు మింగుతాయి. అందుకే మీ హెడింగ్ నచ్చిందని గోపి అంటారు. సరిగ్గా అదే అంశం కొండా లక్ష్మణ్ బాపూజీని తన వృత్తికారుల వేపు, చేనేతన్నల వేపు నిలబెట్టింది. ఆయన సహకార సంఘాలు పెట్టారు. కానీ క్షుద్ర రాజకీయాలు, అధికార చట్టాలు దాన్ని నిర్వీర్యం చేశాయి. ‘హైకో’ను ‘ఆప్కోలో కలిపిన తర్వాత, మరమగ్గాలు, భారీ పెట్టుబడులు మిల్లుల పెత్తనాలు సిరిసిల్ల దీపమార్పి వేసింది. సాంప్రదాయ వృత్తులు కూలిపోయి సాలెల మగ్గం సడుగులిరిగిన ఈ క్రమమంతా కొండా లక్ష్మణ్ బాపూజీ బలహీన వర్గాల వేపు, వారి హక్కుల వేపు నిలబడేలా చేసింది. అర్థ వ్యవసాయం, చేతి వృత్తుల భారత దేశంలో వేగవంతంగా సంభవించిన అసహజ అభివృద్ధి పేరిట జరిగిన మార్పులు మెజారిటీ ప్రజలను అన్నానికి దూరం చేసిన ఈ క్రమం ఆయనను నేతన్నల వేపు నిలబడేలా చేసింది. భూదాన్‌పోచంపల్లిలో బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆయన చేతనే ఆవిష్కరించుకున్నారంటే నేతన్నల్లో ఆయ న ఎంత పాతుకుపోయిన ఏకైక దిక్కో అర్థం చేసుకోవచ్చు. అంతిమంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పునాది రాయేసి నిలిపిన చేనేత భవనంలో దీర్ఘ నిద్రలో నిశ్చలంగా ఉన్నాడు. అది ఆయన కట్టించిన భవనమే. పద్మశాలి హాస్టల్ దిక్కు-దశ అన్నీ ఆయనే.

స్వాతంవూత్యానంతర రాజకీయాలు భ్రష్టుపట్టి పోవడం, క్రమక్షికమంగా సామాజిక, రాజకీయ విలువల పతనంలోనూ ఆయన నమ్మిన గాంధేయవాద విలువల కోసం నిలబడ్డాడు. బలహీన వర్గాల నాయకత్వం గానీ, బీసీ ఉద్యమాలు గానీ రిజర్వేషన్ల కోసం, రాజకీయ సాధికారత పేరిట కొందరు అందలాపూక్కే ప్రణాళికలు వేసుకుంటున్న ఇప్పటి నాయకత్వాలకు మొత్తంగా సామాజిక న్యాయం దృష్టిగానీ, బలహీన వర్గాల హక్కుల పట్ల దృష్టి కానీ కొరవడిన కాలం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీది ఈ అవగాహనలో లోతైన దృష్టి. వ్యవసాయాధారిత వృత్తులు, చేతి వృత్తులు అంతరించిపోతున్న క్రమంలో, జీవనోపాధి అవసరాలు హఠాత్తుగా కనుమరుగై ప్రత్యామ్నాయం లేక కోట్లాదిమంది ఉపాధి కోల్పోతున్న తరుణంలో ఆయన రాజకీయ పోరాటాల్లో అంతర్లీనంగా వృత్తులు బతకడం గురించి యోచన చేశారు. సహకార సంఘం ప్రణాళిక అందులో భాగమే. ఈ విశాల దృష్టి ఆయనకు గ్రామీణ భారత సామాజిక, ఆర్థిక, స్థితిగతులు, ఉత్పత్తి సంబంధాల తీరు, ఉత్పత్తి కులాల మనుగడకు సంబంధించిన సవాళ్ల నుంచి వచ్చి ఉంటాయి.
ఈ సమ్యక్ దృష్టి వల్లనే ఆయన నేత కార్మికులు, వ్యాపారులు యజమానులు వేరు వేరని, వృత్తి కార్మికులు బతకడానికి రాజకీయ పోరాటమే శరణ్యమని నమ్మినవారు. ఆయన అందుకే తెలంగాణ నినాదంతో సామాజికతను జోడించాడు. తెలంగాణ అంతిమ విముక్తి ఇక్కడి సబ్బండ కులాలకు న్యాయం జరిగి, వాటిని బతికించడంలో ఉందని ఆయన నమ్మాడు.

తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ వేదికలను పంచుకున్నప్పుడల్లా ఆయన ఐక్యత గురించి, ఐక్యతా సూత్రాల గురించి యువజన విద్యార్థి ఉద్యమాల గురించి మాట్లాడేవాడు. తెలంగాణకు జరిగిన ద్రోహాల గురించి మాట్లాడేవాడు. తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలయ్యాక ఏక సూత్రంగానే జరిగింది. భౌగోళిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ లాంటి చర్చలు అనేకం జరిగినా ఎక్కడ పెద్దగా వైరుధ్య వాతావరణం లేదు. కానీ అది విస్తృత మవుతున్న కొద్దీ సామాజిక తెలంగాణలాంటి ఇతర డిమాండ్లు ముందుకు వచ్చాయి. మొత్తం ఉద్యమంలో ఒక కీలక సమస్య ఉద్యమ శక్తులు ఐక్యత ప్రదర్శించడం, రాజకీయ శక్తులు పూర్తి అనైక్యంగా ఉండడం అనేది ఆచరణలో తెలంగాణ కు అడ్డంకిగా మారింది. ప్రజలు ఐక్యంగా ఉన్నా రు. ఉద్యమ శక్తులు తమ తమ భిన్నాభివూపాయాలతో సహా ఐక్యత ప్రదర్శించారు. కానీ రాజకీ య పార్టీలు ఐక్యత ప్రదర్శించ లేకపోయాయి. ఇట్లాంటి పరిస్థితులను స్వయంగా చూసిన బాపూజీ విలువైన ఐక్యత సూత్రాన్ని ప్రతిపాదించారు. ముందు తెలంగాణ, తర్వాత రాజకీయ ప్రయోజనాలు అన్నది ఆయన సూత్రం. రాజకీ య ప్రక్రియతో ముడిపడి ఉన్న తెలంగాణ సమ స్య రాజకీయ శక్తుల ఐక్యత ద్వారా సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. తెలంగాణ ఆకాంక్షను రాజకీయ ప్రయోజాల కోసం ఉపయోగించడం కాకుండా, రాజకీయ పార్టీలు శక్తియుక్తు లు, అన్నీ కూడా ముందు తెలంగాణ కల సాకారం కావడానికి ఉపయోగపడాలని బాపూజీ కోరుకున్నారు. అందుకే ఆయన తెలంగాణలోని అన్ని భావజాలా ల ఉద్యమాలకు, పార్టీలు, రాజకీయాలకు కేంద్రబిందువయ్యారు. తెలంగాణ ఐక్యతా చిహ్నం అయ్యారు. ఉద్యమంలో బయటి శక్తుల విమర్శలకు, లోపలి శక్తుల విమర్శలకు మధ్య తేడాను స్పష్టంగా పాటించారు. ఉద్యమ శక్తులు, పార్టీ లు తమనుతాము విమర్శించుకోకూడదని ఆయన కోరుకున్నారు. వర్తమా నంలో నడమంత్రపు సిరి తెచ్చిన రాజకీయ పతనానికి ఎదురుగా నిలబడి ప్రత్యా మ్నా య నైతికత విలువలను కాపాడుకున్న బాపూజీ ఇప్పుడిక మన మధ్య లేరు. మరి నాలుగు రోజుల్లో ఆయన పుట్టిన రోజు. తెలంగాణ ఐక్యతా చిహ్నం, తెలంగాణ పెద్ద దిక్కు, కొండంత అండ, తెలంగాణ చూడకుండానే కన్నుమూశారు. తెలంగాణ సాధించడమే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే అసలు నివాళి. అమర్హ్రే బాపూజీ.. అమర్ రహే.
-అల్లం నారాయణ

No comments:

Post a Comment