Saturday, February 13, 2010

కేసీఆర్ దీక్ష నుంచి విధి విధానాల వరకూ..

కేసీఆర్ దీక్ష నుంచి విధి విధానాల వరకూ..

AndhraJyothy  02/12/2010
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆన్‌లైన్) : నాలుగు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాల ప్రకటనతో ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. నవంబర్ చివరిలో కేసీఆర్ నిరాహార దీక్ష నిర్ణయం.. దాన్ని అడ్డుకుంటూ ఆయన్ను అరెస్టు చేసిన దగ్గర నుంచి.. రాజుకున్న ప్రత్యేక తెలంగాణ డిమాండ్. మధ్య మధ్యలో హోం మంత్రి చిదంబరం ప్రకటనలు.

అవి తెలంగాణ, సీమాంధ్ర నేతల్లో కలిగించిన ఆగ్రహావేశాలు. ఢిల్లీలో రాజకీయ పార్టీలతో సమావేశాలు.. రాష్ట్రంలో పరిస్థితుల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు, విధి విధానాల ఖరారు వరకూ జరిగిన పరిణామాలెన్నో! ఆ కీలక పరిణామాలను ఒక సారి పరిశీలిస్తే....

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్.
నవంబర్ 29: రీంనగర్‌లో కేసీఆర్ అరెస్ట్, ఖమ్మం ఆస్పత్రికి తరలింపు, తెలంగాణలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిణామాలు.
నవంబర్ 30: ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష భగ్నం, నిరశన కొనసాగుతోందని కేసీఆర్ వెల్లడి.
డిసెంబర్ 4: నిమ్స్‌లో విషమించిన కేసీఆర్ ఆరోగ్యం, ఇంటెన్సివ్ కేర్‌కు తరలింపు.
డిసెంబర్ 7: అఖిలపక్ష సమావేశం. తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిస్తామన్న పార్టీలు.
డిసెంబర్ 9: తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రోశయ్యకు సూచన. నిరాహార దీక్ష విరమించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
డిసెంబర్ 10: రాష్ట్రంలో మారిన రాజకీయం. చిదంబరం ప్రకటనను వ్యతిరేకించిన సీమాంధ్ర నేతలు, మూకుమ్మడి రాజీనామాలు.
డిసెంబర్ 15: విజయవాడలో లగడపాటి దీక్ష.
డిసెంబర్ 21: హైదరాబాద్ నిమ్స్‌కు వచ్చిన లగడపాటి.
డిసెంబర్ 23: చిదంబరం మలి ప్రకటన. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భిన్న వైఖరులు తీసుకున్నాయని వెల్లడి, విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటన.
డిసెంబర్ 24: చిదంబరం ప్రకటనపై తెలంగాణల్లో ఆగ్రహావేశాలు. బంద్‌లు, విధ్వంసాలు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వివిధ తెలంగాణ ప్రజా సంఘాలు, సంస్థలతో జేఏసీ ఏర్పాటు యత్నాలు.
డిసెంబర్ 30: చిదంబరం మూడో ప్రకటన. జనవరి 5న ఢిల్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు పిలుపు.
జనవరి 5: ఢిల్లీలో హోం మంత్రితో 8 పార్టీల నేతల భేటీ. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని, ఆందోళనలకు స్వస్తి పలికి శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని అన్ని పార్టీల ఏకాభిప్రాయం. హేతుబద్ద వ్యవధిలోపు చర్చలకు అన్ని పార్టీలూ అంగీకరించాయి.
ఫిబ్రవరి 3: జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించిన కేంద్రం. రాష్ట్రంలో పరిస్థితులపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని వెల్లడి.
ఫిబ్రవరి 10: విధి విధానాలను ఆమోదించిన కాంగ్రెస్ కోర్ కమిటీ.
ఫిబ్రవరి 12: ఏడు అంశాలతో శ్రీకృష్ణ కమిటీకి విధి విధానాలు ప్రకటించిన కేంద్రం.

No comments:

Post a Comment